వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ, అమిత్ షా పేర్ల వెనుక సీక్రెట్ ఇదే.. అందరూ దాన్నే ఫాలో కావాలన్న హర్యానా సీఎం ఖట్టర్

|
Google Oneindia TeluguNews

ఇప్పటికే పరువు హత్యల్లో మన దేశం మొదటి స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రాలవారీగా హర్యానా, యూపీ, బిహార్ లాంటి చోట భయంకరమైన కట్టుబాట్లు అమలవుతున్నాయి. హర్యానాలో ఊరి పెద్దలు ఖాప్ పంచాయితీ పేరుతో కట్టుబాట్లు విధిస్తుండటం చూస్తూనేఉన్నాం. అమ్మాయిలు జీన్స్ వేసుకోవద్దని, అబ్బాయిలు మొబైల్ ఫోన్లు వాడొద్దని, కులాంతర వివాహాలు కుదరవని, కనీసం ప్రేమ వివాహాలను కూడా అంగీకరించబోమని ఖాప్ పంచాయితీలు తీర్మానాలు చేస్తుంటాయి. దీన్నొక దుర్మాగ వ్యవస్థగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. అయినాసరే ఖాప్ చాలా గొప్పదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అంటున్నారు.

మన పెద్దలు చెప్పిందే..

మన పెద్దలు చెప్పిందే..

సాధారణంగా హిందువులు సగోత్రీకుల మధ్య వివాహాలను అనుమతించరు. ఈ ఆచారాన్ని అన్ని కులాల వారు పాటిస్తారు. అయితే గ్రోత్రనామాలకు సైన్స్ తో, ఖాప్ పంచాయితీతో ముడిపెడుతూ సీఎం చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ‘‘ ఒకే గోత్రంలోని వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవద్దని మన పుర్వీకులు చెప్పారు. అది సైంటిఫిగ్ గానూ నిరూపణ అయింది. ఈ నిబంధనలాగే ఖాప్ పంచాయితీ సూచించే విషయాల్లోనూ లోతైన అర్థముంటుంది. కానీ మిగతావాళ్లంతా మన ఖాప్ పంచాయితీ వ్యవస్థను దారుణంగా బద్నామ్ చేశారు‘‘అని ఖట్టర్ చెప్పారు.

గుజరాత్ మోడల్

గుజరాత్ మోడల్

ఒకే గోత్రం లేదా ఒకే ఊరికి చెందిన యువతీ యువకుల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లను కంట్రోల్ చేయడానికి గుజరాత్ గొప్ప మోడల్ ను అనుసరించిందని హర్యానా సీఎం ఖట్టర్ తెలిపారు. ‘‘మీరు గుజరాత్ లో ఎవరినైనా తీసుకోండి.. మగవాళ్ల పేరు పక్కన భాయి అని, ఆడవాళ్ల పేరులో బెహన్ అని కచ్చితంగా ఉంటుంది. ఒకే గోత్రం, ఒకే ఊరికి చెందినవాళ్లంతా అన్నాచెల్లెళ్లే అనే భావన కల్పించడానికే పూర్వీకులు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు''అని వివరించారు.

మోదీ, షా..

మోదీ, షా..

మన ప్రధాని మోదీ పూర్తి పేరు నరేంద్ర దాస్ దామోదర్ దాస్ మోదీ. అయితే గుజరాతీలు మాత్రం ఆయనను నరేంద్ర భాయి లేదా నరేంద్ర భాయి మోదీ అనే పిలుస్తారు. హోం మంత్రి అమిత్ షా కూడా మోదీని నరేంద్ర భాయి అనే ప్రస్తావించడం మనం చాలాసార్లు వినుంటాం. షా పూర్తిపేరు అమిత్ అనిల్ చంద్ర షా. కానీ గుజరాత్ లో ఆయనను అమిత్ భాయి షా గానే వ్యవహరిస్తారు. ఇలా మగవాళ్ల పేర్లలో భాయి అనేది సర్వసాధారణంగా ఉటుంది. ఇక మహిళల విషయానికొస్తే.. బెహెన్ పదానికి షాట్ ఫామ్.. ‘బెన్'అని ఉంటుంది. మోదీ తల్లి పేరు హీరాబెన్, భార్య పేరు జశోదాబెన్. ప్రస్తుత యూపీ గవర్నర్, గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్, ఒకప్పటి ఏపీ గవర్నర్ కుముద్ బెన్ జోషి.. ఇలా మహిళలందరి పేర్లలో బెహెన్ అనే పదముంటుంది. దేశానికి ఇదే మంచి మోడల్ అని హర్యానా సీఎం ఖట్టర్ అన్నారు.

English summary
Haryana Chief Minister Manohar lal Khattar made sensational comments on inter caste and inter village marriages. while addressing A meeting On Friday he also backs khap panchayat system
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X