వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతమే: కదులుతున్న రైలు కింద పడిన బాలుడు సురక్షితం, లోకోపైలట్లే ప్రాణదాతలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆ బాలుడి అదృష్టం బాగుంది. ఎందుకంటే, కదిలే రైలు కింద పడిన ఆ బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. రైలు డ్రైవర్ వెంటనే గమనించి రైలును ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆపడటంతో పెను ప్రమాదం తప్పింది. అనూహ్యంగా ఆ బాలుడు ప్రాణాలతో బయటపడటంతో ఆ రైలు డ్రైవర్, అతని సహాయకుడు ఎంతో ఆనందపడ్డారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

బాలుడ్ని గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసిన లోకో పైలట్..

బాలుడ్ని గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసిన లోకో పైలట్..

వివరాల్లోకి వెళితే.. లోకో పైలట్ దివాన్ సింగ్, అతని సహాయకుడు అతుల్ ఆనంద్.. ఢిల్లీ-ఆగ్రా రైలు నడుస్తున్న సమయంలో రైలు కింద ఓ రెండేళ్ల బాలుడు పడినట్లు గుర్తించారు. వెంటనే వారు అత్యవసర బ్రేకులు వేశారు. ఆ తర్వాత దివాన్, అతుల్ రైలు నుంచి బయటకు దూకేశారు. రైలు కింద బాలుడు క్షేమంగా ఉండటంతో వీరు ఆనంద, ఆశ్చర్యాలకు గురయ్యారు.

బాలుడ్ని తల్లికి అప్పగించారు.. బహుమతి ప్రకటన

బాలుడ్ని తల్లికి అప్పగించారు.. బహుమతి ప్రకటన

రెండు పట్టాల మధ్యలోనే బాలుడు ఉండటంతోనే ఇది సాధ్యమైనట్లు గుర్తించారు.
వెంటనే ఆ బాలుడ్ని బయటకు తీసి, అతని తల్లికి అప్పగించారు. ఈ ఘటన ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన బల్లబ్‌ఘడ్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. కాగా, ఈ గూడ్స్ రైలు డ్రైవర్ జరిగిన ఘటనకు సంబంధించి లిఖిత పూర్వకంగా పై అధికారులకు తెలియజేశారు. దీంతో ఆ ఇద్దరు రైలు డ్రైవర్లకు ఉన్నతాధికారులు బహుమతి ప్రకటించారు. వారిని అభినందించారు.

వీడియో వైరల్.. లోకో పైలట్లపై ప్రశంసలు

ఆ బాలుడు, అతని 14ఏళ్ల సోదరుడు పట్టాల సమీపంలో ఆడుకుంటుండగా.. అతడు రైలు కిందపడినట్లు తెలుస్తోంది. బాలుడు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సదరు ఇద్దరు లోకో పైలట్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

English summary
By the time loco pilot Deewan Singh and his assistant Atul Anand could spot a two-year-old in the middle of the tracks their goods train was already running. They hurried to apply emergency brakes and the train screeched to a halt but only after it had passed over the boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X