వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలకు కరోనా: సెల్ఫ్ ఐసోలేషన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హర్యానా డిప్యూటీ సీఎం, జననాయక్ జనతా పార్టీ నేత దుష్యంత్ చౌతాలా కరోనా మహమ్మారిన పడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఏమీ లేనప్పటికీ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు.

ఇటీవల తనను కలిసిన వారందరూ కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కోరారు. ఇది ఇలా ఉంటే పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ సిద్దు కూడా కరోనా బారినపడ్డారు. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

Haryana Deputy CM Dushyant Chautala tests positive for COVID-19

మంగళవారం బల్బీర్ సింగ్‌కు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. జ్వరంతోపాటు ఒంటి నొప్పులతో ఆయన బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. దీంతో పరీక్షలు నిర్వహించుకోగా కరోనా సోకినట్లు తేలిందన్నారు. ఆయనను కలిసిన వారిని కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి బల్బీర్ సింగ్ ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం.

కాగా, హర్యానా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,36,115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,320 యాక్టివ్ కేసులున్నాయి. 1,23,286 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,509 మంది కరోనా బారినపడి మరణించారు.

పంజాబ్ రాష్ట్రంలో 1,20,016 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుం ఈ రాష్ట్రంలో 11,982 యాక్టివ్ కేసులున్నాయి. 1,04,355 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 3,679 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతూ మృతి చెందారు.

English summary
Deputy Chief Minister of Haryana and Jannayak Janata Party leader Dushyant Chautala on Tuesday announced on social media that he has tested positive for Covd-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X