వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్యానాలో డిప్యూటీ సీఎం కోసం పోటీ, దుష్యంత్‌తో నైనా పోటీ.. బీజేపీ నుంచి తెరపైకి విజ్ పేరు...?

|
Google Oneindia TeluguNews

హర్యానా సస్పెన్స్‌కు తెరబడింది. జేజేపీ బీజేపీతో జట్టుకట్టడంతో ప్రభుత్వం ఏర్పాటు అడుగుదూరంలో నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి తాము బీజేపీతో జట్టుకట్టబోతున్నామని జేజేపీ క్లారిటీ ఇచ్చింది. డిప్యూటీ సీఎం సహా రెండు మంత్రి పదవులపై కూడా అంగీకారం కుదిరింది. ఇవాళ బీజేపీఎల్పీ సమావేశమై సభా నాయకుడిని ఎన్నుకున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి బీజేఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. రెండోసారి సీఎం పదవీని ఖట్టర్ చేపట్టబోతున్నారు.

బీజేఎల్పీ నేతగా ఖట్టర్

బీజేఎల్పీ నేతగా ఖట్టర్

చండీఘడ్‌ బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీఎల్పీ సమావేశం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలుసభా నాయకుడిగా మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఎన్నుకున్నారు. సీఎం పదవీ కోసం రెండో పేరు ప్రతిపాదనే లేకుండా బీజేపీ జాగ్రత్తులు తీసుకుంది. బీజేఎల్పీ నేత ఎంపిక ప్రక్రియను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాదర్, మరో సీనియర్ నేత అరుణ్ సింగ్ సమక్షంలో జరిగింది. బీజేఎల్పీ నేత ఎంపిక ప్రక్రియకు పరిశీలకురాలిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. కానీ సమావేశానికి ఆమె హాజరుకాలేదు.

డిప్యూటీ పోస్టు కోసం పోటీ

డిప్యూటీ పోస్టు కోసం పోటీ

ప్రభుత్వానికి మద్దతు తెలిపిన జేజేపీ చీఫ్ దుష్యంత్ సింగ్‌కు డిప్యూటీ సీఎం పదవీ ఇస్తామని శుక్రవారం రాత్రి బీజేపీ హైకమాండ్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే జేజేపీలో మాత్రం డిప్యూటీ సీఎం పదవీ కోసం పోటీ నెలకొంది. దీంతో ఆ పదవీ ఎవరికీ వరిస్తుందో అన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది. జేజేపీకి డిప్యూటీ సీఎం పదవీ ఇస్తే నైనా చౌతాలా పేరు కూడా ముందువరసలో ఉంది. కానీ దుష్యంత్ తానే రేసులో ఉన్నానని చెప్పడం కలకలం రేపుతోంది. ఒకవేళ నైనా చౌతాలాను పదవీ వరిస్తే.. రాష్ట్ర చరిత్రో ఓ మహిళ తొలిసారి డిప్యూటీ సీఎం పదవీ చేపట్టిన వారు అవుతారని ఆ పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.

దుష్యంత్ వర్సెస్ అనిల్ విజ్

దుష్యంత్ వర్సెస్ అనిల్ విజ్

బీజేఎల్పీ సమావేశం నిర్వహించగా.. అంటు జేజేపీ కూడా సమావేశమైంది. బీజేపీ కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల తమ ఆఫీసులో సమావేశమై డిస్కస్ చేశారు. సమావేశం పూర్తయ్యాక దుష్యంత్ చౌతాలా గవర్నర్‌ను కలిసి తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నామనే అంశాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తారు. ఇదిలాఉంటే మరోవైపు డిప్యూటీ సీఎం పోస్టు కోసం బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్ పేరు వినిపిస్తోంది. ఆయన ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన డిప్యూటీ సీఎం పదవీ కోసం పోటీపడుతుండటం ఆసక్తి కలిగిస్తోంది. బీజేపీలో తానే సీనియర్ అని చెప్పుకొంటున్నారు. మరోవైపు దుష్యంత్- విజ్ మధ్య మాటలయుద్ధం కూడా జరిగింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పదవీ కోసం విజ్ కూడా పట్టుబడుతున్నారు.

ఇదివరకు లేదు.. ఇప్పుడు ఉండదు

ఇదివరకు లేదు.. ఇప్పుడు ఉండదు

హర్యానాలో ఇదివరకు రెండు డిప్యూటీ సీఎం పదవీలు ఇవ్వలేదు. ఈ సారి కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తామని బీజేపీ హైకమాండ్ స్పష్టతనివ్వలేదు. శుక్రవారం రాత్రి కూడా బీజేపీ చీఫ్ అమిత్ షా దుష్యంతే డిప్యూటీ సీఎం అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐదేళ్లు తమ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. కానీ అనిల్ విజ్ పేరు తెరపైకి రావడంతో.. అమిత్ షా ఏం చెప్పి సర్దిచెబుతారో చూడాలి.

ముహూర్తం ఖరారు

ముహూర్తం ఖరారు

హర్యానా సీఎంగా ఖట్టర్ ఆదివారం ప్రమాణం చేసే అవకాశం ఉంది. శనివారం తొలుత దుష్యంత్ గవర్నర్‌ను కలిసి బీజేపీకి మద్దతిస్తామని చెబుతారు. తర్వాత ఖట్టర్ తన ఎమ్మెల్యేల లేఖతో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరతారు. గవర్నర్ ఆహ్వానం మేరకు ఆదివారం హర్యానాలో కొత్త సర్కార్ కొలువుదీరనుంది.

English summary
Manohar Lal Khattar was unanimously elected as the head of BJP’s Haryana legislative party on Saturday at a meeting of newly-elected MLAs at a UT guesthouse in Chandigarh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X