వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17ఏళ్ల తర్వాత: భారత అమ్మాయికి మిస్ వరల్డ్ కిరీటం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Miss World 2017 Manushi Chhillar : మిస్ వరల్డ్ పై 'చిల్లర' వ్యాఖ్యలు | Oneindia Telugu

న్యూఢిల్లీ/బీజింగ్: ప్రపంచ సుందరిగా భారతీయ యువతి మానుషి చిల్లార్‌ విజయం సాధించి కిరీటం సొంతం చేసుకుంది. చైనాలోని సన్యా సిటీ ఎరీనా ప్రాంతంలో జరిగిన 67వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పలు దేశాలకు చెందిన 118 మంది ముద్దుగుమ్మలు పాల్గొన్నారు.

అదరగొట్టిన హర్యానా సుందరి

అదరగొట్టిన హర్యానా సుందరి

హర్యానాకు చెందిన 21ఏళ్ల ఈ వైద్య విద్యార్థిని చిల్లార్‌ గ్రాండ్‌ ఫైనల్‌లో అందరినీ వెనక్కి నెట్టి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫైనల్‌ పోటీలను శనివారం నిర్వహించారు.

17ఏళ్ల తర్వాత మళ్లీ..

17ఏళ్ల తర్వాత మళ్లీ..

2000లో బాలీవుడ్‌ నటి ప్రియాంకాచోప్రా మిస్‌వరల్డ్‌గా నిలిచింది. ఆ తర్వాత దాదాపు 17ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని భారత్‌కు చెందిన చిల్లార్‌ దక్కించుకుంది

చిన్ననాటి కల

చిన్ననాటి కల

మిస్ వరల్డ్‌గా ఎంపికవడం అనేది తన చిన్ననాటి కల అని మానుషి ఈ సంద‌ర్భంగా పేర్కొంది. విజేతగా ఎంపికవడం అనేది ఒక ప్రయాణమని.. దాన్ని తానెప్పుడు మరచిపోనన్నారు. ఈ ప్రయాణంలో తానెంతో నేర్చుకున్నానని.. ఎంతో సంతోషం పొందినా.. ఫలితాన్ని మాత్రం విధికి వదిలేసినట్లు తెలిపింది.

రన్నరప్‌లుగా వీరే..

రన్నరప్‌లుగా వీరే..

ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా మెక్సికోకి చెందిన ఆండ్రియా మేజా నిలవగా.. రెండో రన్నరప్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన స్టీఫెనీ హిల్‌ నిలిచింది. కాగా, అందరిని వెనక్కినెట్టి విజేతగా నిలిచిన మానుషి చిల్లార్‌కు మిస్ వరల్డ్-2016 విన్నర్ స్టెఫానే డెల్‌వాలే కిరీటాన్ని బహుకరించింది.

English summary
Haryana girl Manushi Chillar on Saturday was crowned as the Miss World 2017 at the contest held at the Sanya City Arena in China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X