వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రిపై కోవ్యాక్జిన్ ప్రయోగం: మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌ ఆయనేతో ప్రారంభం: ఆసుపత్రిలో

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి రూపొందించిన కోవ్యాక్జిన్ మూడోదశ క్లినకల్ ట్రయల్స్ హర్యానాలో కొద్దిసేపటి కిందటే ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా- ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్‌పై వ్యాక్సిన్‌ను ప్రయోగించారు. అంబాలాలోని ఆసుపత్రిలో డాక్టర్లు ఆయనకు కోవ్యాక్జిన్ డోస్‌ను ఎక్కించారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిపుణులు పర్యవేక్షించారు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఓ మంత్రిపై ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి.

ఎన్నికల నెల: గ్రేటర్‌లో కరోనా: తెలంగాణలో ఇక తగ్గుముఖమే: రెండున్నర లక్షలకు చేరువగా ఎన్నికల నెల: గ్రేటర్‌లో కరోనా: తెలంగాణలో ఇక తగ్గుముఖమే: రెండున్నర లక్షలకు చేరువగా

కోవ్యాక్జిన్ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. హర్యానాలో మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించారు ఐసీఎంఆర్ అధికారులు. దీనికి వలంటీర్లను ఎంపిక చేశారు. అధికారులు ఎంపిక చేసిన వలంటీర్లలో అనిల్ విజ్ ఒకరు. తాను స్వచ్ఛందంగా పాల్గొంటానని ఇదివరకే ఆయన ఐసీఎంఆర్ అధికారులకు వెల్లడించారు.

Haryana: Health Minister Anil Vij being administered trial dose of COVID-19 vaccine Covaxin

దీనితో అంబాలా ఆసుపత్రిలో మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించారు. అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గానికి అనిల్ విజ్ అసెంబ్లీలో ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. రోహ్‌తక్‌లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు, వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, ఐసీఎంఆర్ ప్రతినిధుల సమక్షంలో మంత్రి అనిల్ విజ్‌ శరీరంలోకి కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్ చేశారు. అనంతరం ఆయనను పరిశీలనలో ఉంచారు.

Recommended Video

Covid-19 Vaccine : వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌.. అందుబాటు ధరలో!

కిందటి నెలలోనే కోవ్యాక్జిన్ తొలి, మలి దశ ప్రయోగాలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ రెండు దశల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైంది. దీనితో మూడోదశలోకి అడుగు పెట్టారు. ఈ దశలో వలంటీర్లపై దీన్ని ప్రయోగించాల్సి ఉంది. దీనికోసం దేశవ్యాప్తంగా 26 వేల మందిని ఎంపిక చేశారు. మొత్తం 25 ప్రాంతాల్లో మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ మూడోదశలో అడుగు పెట్టడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ దశను విజయవంతంగా అధిగమించగలిగితే.. త్వరలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

English summary
Haryana Health Minister Anil Vij on Friday administered a trial dose of coronavirus vaccine candidate Covaxin, at a hospital in Ambala. He had offered to be the first volunteer for the third phase trial of Covaxin, which started in the state today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X