వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా... నెలరోజుల్లోపే రక్కసీ, ఏకంగా హర్యానా మంత్రికే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కోసం వివిధ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ రూపొందిస్తున్నాయి. అవీ చివరి దశలో ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్‌ను వాలంటీర్లు కాకుండా ప్రముఖులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల హర్యానా వైద్యారోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ కూడా టీకా వేయించుకున్నారు. కానీ ఆయనకు కరోనా వైరస్ రావడం కలకలం రేపింది.

Recommended Video

Anil Vij Tests COVID Positive, Covaxin Trials based on 2-doses:Bharat Biotech

గతనెల 20వ తేదీన అనిల్ టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాక్సిన్ తీసుకున్నారు. తనకు కరోనా వైరస్ సోకిందని ఆయనే ట్వీట్ చేశారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు టెస్ట్ చేసుకోవాలని సూచించారు. తాను ప్రస్తుతం అంబాలాలో గల సివిల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని వివరించారు. అయితే అదే ఆస్పత్రిలో కరోనా వైరస్ కోసం గతనెల 20వ తేదీన టీకా తీసుకోవడం విశేషం.

Haryana Health Minister Anil Vij tests positive

కరోనా వైరస్ వ్యాక్సిన్ మూడో దశలో చాలా మంది వాలంటీర్స్ టీకా తీసుకున్నారు. ఎక్కువ మంది యువతే ఉన్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ రావడం కలకలం రేపింది. కోవాక్సిన్ టీకాను భారత్ బయోటెక్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కలిసి అభివృద్ధి చేశాయి. ఇదివరకు ఫేజ్ 1, ఫేజ్ 2 సమర్థవంతంగా పూర్తిచేశామని కంపెనీ తెలిపింది. అయితే మూడో దశలో ఏకంగా మంత్రికే వైరస్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

English summary
Haryana Health Minister Anil Vij has tested positive for coronavirus days after being administered a trial dose of coronavirus vaccine Covaxin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X