వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే: కీలక బిల్లుకు హర్యానా అసెంబ్లీ ఆమోదం, ప్రతిపక్షాలు గుస్సా...

|
Google Oneindia TeluguNews

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మెజార్టీ ప్రైవేట్ సెక్టార్ కొలువులు స్థానికులకే ఇస్తామని స్పష్టంచేసింది. ప్రైవేట్ కొలువుల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లును హర్యానా అసెంబ్లీ ఆమోదించింది. అయితే బీజేపీ భాగస్వామ్యంలో గల జేజేపీ దీనిని వ్యతిరేకించడం విశేషం.

 స్థానికులకే అని చెప్పి

స్థానికులకే అని చెప్పి

స్థానికులకే కొలువులు ఇస్తామని 2019 ఎన్నికల్లో జేజేపీ పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కంపెనీలు, సొసైటీలు, ట్రస్ట్, భాగస్వామ్య సంస్థలు తదితర వాటిల్లో లోకల్స్‌‌కు అవకాశం ఇస్తామని పేర్కొన్నది. బీజేపీ సర్కార్ హర్యానా స్టేట్ ఎంప్లాయీమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిటెట్స్ బిల్-2020 ప్రవేశపెట్టి ఆమోదించింది.

 సరికాదు..

సరికాదు..

హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై కంపెనీలు పెదవి విరుస్తున్నాయి. దీంతో తమ పోటీ తత్వం తగ్గే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. హర్యానాకు పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఇదివరకు ఉన్న ఉపాధి కల్పన బాగుందని చెప్పారు.

ఏ జిల్లాలో అయినా సరే..

ఏ జిల్లాలో అయినా సరే..

బిల్లు ప్రకారం ప్రతీ కంపెనీ తమ సంస్థలో 75 శాతం మంది స్థానికులకు ఉపాధి కల్పించాలి. వారు హర్యానాలోని ఏ జిల్లాకు చెందినవారైనా సరేనని తెలిపింది. రూ.50 వేలు, అంతకన్నా తక్కువ జీతంతో ఉపాధి కల్పించారు. దీనిని జేజేపీ ఎమ్మెల్యే రామ్ కుమార్ గౌతమ్ ఖండించారు. దేశం ప్రతీ ఒక్కరిదీ అని.. ఎందుకీ పక్షపాతం అన్నారు. పంటల కోసం బీహరీలు మన వద్దకు, హర్యానాకు చెందిన వారు ఇతర ప్రాంతాలకు వెళుతుంటారని తెలిపారు. కానీ సర్కార్ తీసుకొచ్చిన చట్టం బాగోలేదన్నారు.

 మరీ అక్కడ..

మరీ అక్కడ..

మరో రోజు మన పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళితే పరిస్థితి ఏంటీ అని అడిగారు. అక్కడ వారిని పనిచేయకుంటే ఏం చేయాలన్నారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని ప్రతిపక్షాలు కోరాయి. కానీ అధికార పక్షం పట్టించుకోలేదు. తమకు 90 మంది సభ్యుల బలం ఉంది అని ప్రవేశపెట్టి.. ఆమోదింపజేసుకుంది. ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

English summary
Haryana Assembly passed a Bill Thursday to reserve 75 per cent of private sector jobs in the state for residents of Haryana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X