వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతులు మొబైల్స్, జీన్స్ ధరించొద్దు: ఇసీపూర్ గ్రామపంచాయితీ తీర్మానం

By Narsimha
|
Google Oneindia TeluguNews

చంఢీఘడ్: యువతులు జీన్స్ ధరించరాదని, మొబైల్‌ఫోన్లు వాడరాదని హర్యానా రాష్ట్రంలోని ఓ గ్రామపంచాయితీ తీర్మానం చేసింది.ఈ తీర్మానంపై యువతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మహిళలు అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్నారు. కానీ, కొన్ని గ్రామాల్లో తీసుకొంటున్న నిర్ణయాలు ఇంకా మహిళల పట్ల తమకున్న వివక్షను ప్రతిబింభిస్తున్నాయి. ఈ తరహ ఘటనలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి.

Haryana panchayat bans girls from wearing jeans, using mobile phones

హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ సమీపంలోని ఇసీపూర్ ఖేదీ గ్రామపంచాయితీలో యువతులు జీన్స్ ధరించరాదని, మొబైల్‌ఫోన్స్ కూడ వాడకూదని నిర్ణయం తీసుకొన్నారు. గ్రామ పంచాయితీ పెద్దలు చేసిన ఈ తీర్మానంపై స్థానికంగా ఉన్న యువతులు మండిపడుతున్నారు.

తాము ఏ రకమైన దుస్తులు ధరించాలనేది సమస్య కాదన్నారు. పురుషుల మనస్తత్వంతోనే ఇబ్బందులు ఎదురౌతున్నాయని యువతులు అభిప్రాయపడుతున్నారు. దుస్తులను బట్టి మహిళల వ్యక్తిత్వాన్ని ఎలా అంచనావేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

గతంలో రాజస్థాన్‌లో కూడ ఇదే తరహాలో గ్రామపంచాయితీ పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు. గత ఏడాది జూలై 27న ధోల్‌పూర్ జిల్లాలోని ఓ పంచాయితీలో యువతులు జీన్స్ వేసుకోరాదని, మొబైల్ ఫోన్స్ వాడరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై అప్పట్లో రాజస్థాన్ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది.

English summary
In yet another instance of a bizarre directive, a panchayat in a village in Haryana has banned girls from wearing jeans and using mobile phones. The directive has been given by the panchayat in Isipur Khedi village in Sonipat in Haryana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X