వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబా కేసు: పోలీసుల నెక్ట్స్‌ టార్గెట్‌.. విపాసన ఇన్సాన్

అత్యాచార కేసులో గుర్మీత్‌ రామ్ రహీమ్ సింగ్‌ దోషిగా ఖరారైన అనంతరం చెలరేగిన హింసాకాండకు సంబంధించి డేరా సచా సౌధా చైర్‌పర్సన్‌ విపాసన ఇన్సాన్‌ను హర్యానా పోలీసులు త్వరలో విచారించనున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: అత్యాచార కేసులో గుర్మీత్‌ సింగ్‌ దోషిగా ఖరారైన అనంతరం చెలరేగిన హింసాకాండకు సంబంధించి డేరా సచా సౌధా చైర్‌పర్సన్‌ విపాసన ఇన్సాన్‌ను హర్యానా పోలీసులు త్వరలో విచారించనున్నారు.

డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ తదుపరి వారసురాలిగా విపాసన ఇన్సాన్‌ను ప్రకటిస్తారని భావిస్తున్నారు. విపాసనను విచారణలో పాలుపంచుకోవాలని సిర్సా పోలీసులు త్వరలో కోరనున్నారని హర్యానా డీజీపీ బీఎస్‌ సంధూ చెప్పారు.

vipasana-insan

మరోవైపు డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారని, డేరా వ్యవహారాల్లో కీలక వ్యక్తి ఆదిత్య ఇన్సాన్‌ సైతం ప్రస్తుతం దేశంలోనే ఉన్నారని భావిస్తున్నట్టు డీజీపీ బీఎస్‌ సంధూ చెప్పారు.

వీరిని పట్టుకునేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌లకు పోలీస్‌ బృందాలను పంపామన్నారు. వారు దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకునేందుకు వారిపై లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశామన్నారు.

English summary
The Haryana police will soon interrogate Dera Sacha Sauda chairperson Vipassana Insan in connection with the violence that had broken out in Panchkula and Sirsa following the sect head's rape conviction. Vipassana is one of the likely successors of Gurmeet Ram Rahim Singh. "Sirsa police will soon ask Vipassana Insan to join the investigation," Haryana DGP B S Sandhu said here today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X