వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు ఆచూకీ పసిగట్టిన పోలీసులు, ఢిల్లీ నివాసంపై దాడి.. హనీప్రీత్ పరుగో పరుగు!

డేరాబాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ సింగ్ కోసం పోలీసుల నుంచి తప్పించుకుంది.న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లోని ఎ-బ్లాక్ లో హనీప్రీత్ సింగ్ ఉన్నట్టు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Honeypreet Insan escaped From Police హనీప్రీత్ జస్ట్ మిస్ ( వీడియో) | Oneindia Telugu

న్యూఢిల్లీ: డేరాబాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ సింగ్ కోసం పోలీసుల నుంచి తప్పించుకుంది. హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ ఢిల్లీలో ఉన్నట్లు, హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో ఆమెకోసం పోలీసులు ముమ్మర గాలింపు జరుపుతున్నారు.

హనీప్రీత్ కు ముందస్తు బెయిల్ మంజూరుకాక ముందే... ఆమెకు అరెస్టు వారెంటు జారీ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లోని ఎ-బ్లాక్ లో హనీప్రీత్ సింగ్ ఉన్నట్టు తెలియడంతో హర్యానా పోలీసులు మంగళవారం ఆ ప్రాంతమంతా మెరుపు సోదాలు నిర్వహించారు.

Haryana Police search for Honeypreet in Delhi, But She Escaped

అయితే అప్పటికే జాగ్రత్త పడిన హనీప్రీత్ సింగ్ అక్కడి నుంచి కూడా ఉడాయించినట్టు తెలుస్తోంది. అనంతరం ఢిల్లీలోని చిత్తరంజన్ పార్కు ప్రాంతంలో కూడా పోలీసులు హనీప్రీత్ కోసం గాలించారు. అక్కడ కూడా ఆమె జాడ కనిపించలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ముందస్తు బెయిల్ కోసం హనీప్రీత్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆమె లాయర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బెయిల్ పిటిషన్ దరఖాస్తుపై సంతకం పెట్టేందుకు సోమవారం హనీప్రీత్ తన కార్యాలయానికి వచ్చి వెళ్లినట్టు కూడా ఆయన పేర్కొన్నారు. మంగళవారం హనీప్రీత్ బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హనీప్రీత్ ఆచూకీ పసిగట్టేందుకు మొత్తం ఐదు బృందాలను పోలీసులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో హనీప్రీత్ సింగ్ ఉన్నట్టు తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే హనీప్రీత్ అక్కడ్నించి జంప్ అయింది.

English summary
The Haryana Police on Tuesday conducted searches in Delhi to trace jailed Dera Sacha Sauda chief's adopted daughter Honeypreet Insan against whom an arrest warrant has been issued in connection with incidents of violence following Gurmeet Ram Rahim's conviction. The police here said that searches were being conducted at various locations to trace Honeypreet and two other key Dera functionaries, though they did not specify the places where they were carrying out the search. The Delhi Police said a team of the Panchkula Police had come with an arrest warrant for Honeypreet on a tip off that she was present in a house in A block in Greater Kailash in New Delhi. However, the raid did not yield anything, DCP Southeast Romil Baaniya said. The raid was conducted at 7.30 am and only the caretaker was found. The house was registered in the name of the Dera Sacha Sauda, Baaniya said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X