వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమానుషం: ఏడాదికిపైగా భార్యను టాయ్‌లెట్‌లో బంధించాడు, ఎట్టకేలకు విముక్తి

|
Google Oneindia TeluguNews

పానిపట్: కట్టుకున్న భర్త ఆమెకు బతికుండగానే నరకం చూపించాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏడాదిపాటు ఆమెను టాయ్‌లెట్‌లో పెట్టి బంధించేశాడు. హర్యానాలోని రిష్పూర్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చివరకు మహిళా రక్షణ, బాల్య వివాహ నిషేధ అధికారి రజనీ గుప్తా, తన బృందంతో కలిసి ఆమెకు విముక్తి కల్పించారు.

ఏడాదిపాటు టాయ్‌లెట్‌లో బందీగా..

ఏడాదిపాటు టాయ్‌లెట్‌లో బందీగా..

తమకు అందిన సమాచారం మేరకు ఆ మహిళను కాపాడినట్లు తెలిపారు. ‘ఓ మహిళ టాయిలెట్‌లో ఒక సంవత్సరానికి పైగా లాక్ చేయబడిందని నాకు సమాచారం అందింది. నేను నా బృందంతో ఇక్కడకు వచ్చాను. మేము ఇక్కడికి చేరుకున్నప్పుడు అది నిజమని మేము కనుగొన్నాము. చాలా రోజులుగా స్త్రీ ఏమీ తినలేదని తెలుస్తోంది' అని రజనీ గుప్తా వెల్లడించారు.

విముక్తి లభించిన తర్వాత..

విముక్తి లభించిన తర్వాత..

‘ఆమె మానసిక స్థితి బాగోలేదని చెప్పారని, కానీ అది నిజం కాదు. మేము ఆమెతో మాట్లాడాము, దీంతో ఆమె మానసికంగా అస్థిరంగా లేదని స్పష్టమైంది. ఆమె మానసికంగా అస్థిరంగా ఉందో లేదో మేము ధృవీకరించలేము, కానీ, మరుగుదొడ్డిలో ఆమె బందీ చేయబడింది. మేము ఆమెను రక్షించి, జుట్టు శుభ్రం చేశాం. పోలీసు ఫిర్యాదు చేశాము. పోలీసులు దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు' అని ఆమె తెలిపారు.

మెంటల్ పేషెంట్ అంటూ భర్త..

మెంటల్ పేషెంట్ అంటూ భర్త..


కాగా, బాధితురాలి భర్త.. ఆమె మానసికంగా అస్థిరంగా ఉందని పేర్కొన్నాడు. ‘ఆమె మానసికంగా అస్థిరంగా ఉంది. మేము ఆమెను బయట కూర్చోమని అడుగుతున్నా.. ఆమె అక్కడ కూర్చోలేదు. మేము ఆమెను వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాము కానీ, ఆమె స్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు' అని బాధితురాలి భర్త తెలిపాడు.

దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

దర్యాప్తు చేస్తున్న పోలీసులు..


కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘రజనీ గుప్తా గ్రామానికి వెళ్లి భర్త నరేష్ చేత ఒక సంవత్సరానికి పైగా బందీ చేయబడిన మహిళను రక్షించారు. మేము ఫిర్యాదు నమోదు చేశాము, దర్యాప్తు తర్వాత మేము చర్యలు తీసుకుంటాము. ఆ మహిళ మానసికంగా అస్థిరంగా ఉందని చెబుతున్నారు. డాక్టర్ సలహాతో మరింత ముందుకు సాగుతాం, అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

English summary
A woman, who was allegedly locked inside a toilet for over a year by her husband in Rishpur village, was rescued by Women Protection and Child Marriage Prohibition Officer Rajni Gupta along with her team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X