వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం దుకాణం బంద్ చేస్తారా, లేదా మమ్మల్నే తాగమంటారా ! హర్యానా మహిళల వినూత్న నిరసన

|
Google Oneindia TeluguNews

మద్యం మహమ్మారి మహిళల జీవితాల్లో ఎంత చీకటి నిప్పుతుందో అందరకి తెలుసు. అలాంటీ మద్యాన్ని నిషేధించడం కోసం అనేక పోరాటాలు ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే ,ఇప్పటికి మహిళలు అక్కడక్కడ మద్యానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తునే ఉన్నారు. కాని పాలకులు , మద్యం వ్యాపారులు వాటిని పట్టించుకునే పరిస్థితి మాత్రం ఉండదు. అయితే హర్యానలో మాత్రం వ్యాపారులు దిగివచ్చేవరకుమహిళలు వినూత్న నిరసన తెలిపి విజయం సాధించారు.

Haryana women variety protest against alcohol

మద్యం దుకాణానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన మహిళలు

తాజాగా హర్యానాలోని ఫరీదా బాద్ లో మద్యం దుకాణం ఉంది. అయితే ఆ దుకాణంతో స్థానికంగా ఉన్న మహిళలు చాల ఇబ్బందులు పడుతున్నారు. మద్యం సేవించిన వారు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. దీనిపై మహిళలు ఎక్సైజ్ అధికారులకు సైతం పిర్యాధు చేశారు. మరోవైపు తాజాగా ఆ మద్యం దుకాణం యొక్క గడువు కూడ ముగిసిపోయింది. అయినా అది కొనసాగిస్తుండడంతో మహిళలుకన్నెర్ర చేశారు. అధికారులకు పలు వినతిపత్రాలు అందించారు. అయినా చలనం లేదు.

తామే మద్యం సీసాలు పట్టుకుని తాగిన మహిళలు

ఎంత ఆందోళన చేసిన అటు వ్యాపారులు, ఇటు అధికారులు దిగిరాకపోవడంతో మహిళలు ఏకంగా ఎక్సైజ్ కార్యాలయానికి చేరకున్నారు. అక్కడ ధర్నా చేపట్టారు. తాము వినూత్న నిరసన చేపట్టారు. దుకాణం బంద్ చేస్తారా లేదంటే మేమే కూడ మద్యం సేవించి నిరసన చేపట్టారు.దీంతో దిగివచ్చిన అధికారులు వారం రోజుల్లో మద్యం షాపును మూసి వేయాలని సంబంధిత యజమానులకు ఆదేశాలు జారి చేశారు.

English summary
The women variety protest against alcohol in front of excise office in Haryana , they drinks alcohol be fore the officers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X