వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దు సామాన్యులకు లాభమే

కేంద్రప్రభుత్వం తీసుకొన్న పెద్ద నగదు నోట్ల రద్దుపై మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాన్ని సానుకూలంగావ్యక్తపర్చారు. 59.3 శాతంప్రజలుఈనిర్ణయాన్ని స్వాగతిస్తే,40.7 శాతం ప్రజలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు. : కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులకు ప్రయోజనకారిగా ఉంటుందని సామాన్యులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న పెద్ద నగదు నోట్ల రద్దుపై వన్ ఇండియా ఆన్ లైన్ సర్వే నిర్వహించింది.ఈ సర్వేకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. మెజారిటీ ప్రజలు దీర్ఘకాలంలో ఈ నిర్ణయంతో సామాన్యులకు ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

నోట్ల రద్దు సగటు జీవికి ఉపయోగపడుతుందని ఎక్కువ మంది ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. దాదాపు అరవై శాతం మంది నోట్ల రద్దు దీర్ఘ కాలంలో కామన్ మ్యాన్‌కు ఉపయుక్తమని చెప్పారు. నలభై శాతానికి పైగా మాత్రం ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు.

currency

ఐదువందలు, వెయ్యి రూపాయాల నగదు నోట్లను రద్దు చేసిన అంశంపై వన్ఇండియా నిర్వహించిన సర్వేలో 31,194 మంది పాల్గొన్నారు. అయితే మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. 59.3 శాతం మంది ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. 40.7 శాతం మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.18,503 మంది ప్రధానమంత్రి నిర్ణయానికి మద్దతు పలికారు, 12,691 మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

తెలుగు, కన్నడ, మళయాళం, బెంగాల్, గుజరాత్ ,తమిళ, ఇంగ్లీష్ లలో వన్ఇండియా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 31,198 మంది పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. కేంద్రం తీసుకొన్న నిర్ణయం సుదీర్ఘ కాలంలో దేశానికి, ప్రధానంగా సామాన్యులకు ప్రయోజనంగా ఉంటాయని మెజారిటీ అభిప్రాయపడ్డారు.

English summary
There has been a lot of hype and debate around the decision taken by the government on demonetisation. While the Prime Minister of India, Narendra Modi assured that this move would help the nation a great deal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X