• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫేస్‌బుక్‌కు ఝలక్: సమన్లు జారీ - బీజేపీతో లింకులపై 2న పార్లమెంటరీ కమిటీ విచారణ - ట్విస్టులు

|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై నెలకొన్న వివాదంలో అనూహ్య పరిణామాం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ వ్యవహరిస్తున్నదని, అందులో భాగంగానే కాషాయ నేతల విద్వేష వ్యాఖ్యలపై చర్యలు తీసుకోలేదంటూ వచ్చిన ఆరోపణలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారించనుంది. 'ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ' చైర్మన్ పదవి నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను తప్పించాలంటూ బీజేపీ ఎంపీలు ఫిర్యాదులు చేసిన కొద్దిగంటలకే, ఫేస్ బుక్ కు నోటీసులు జారీ కావడం గమనార్హం.

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చైర్మన్ గా ఉన్న 'ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ' ముందుకు సెప్టెంబర్ 2న ఫేస్ బుక్ ప్రతినిధులు హాజరు కావాలంటూ లోక్ సభ సెక్రటేరియట్ గురువారం నోటీసులు జారీ చేసింది. విద్వేష వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను క్రమం తప్పకుండా తొలగించే ఫేస్ బుక్.. బీజేపీ నేతల ప్రసంగాల జోలికి మాత్రం వెళ్లడం లేదన్నది ప్రధాన ఆరోపణ. అయితే దీన్ని ఫేస్ బుక్ సంస్థ, బీజేపీ ఇదివరకే ఖండించాయి. ఈ నేపథ్యంలో విచారణ ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

చైనా -పాక్ ప్లాన్: భారత్‌పై అణుయుద్ధం - ముస్లింలపై పడకుండా బాంబులేస్తాం - పాక్ మంత్రి ప్రేలాపన

Hate speech row: Parliamentary panel summons Facebook on September 2nd

ఫేస్ బుక్ వివాదంపై తన అభిప్రాయాలను బహిరంగా చెబుతోన్న శశి థరూర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యక్ష పదవికి అనర్హుడని, ఆయన తీరు లోక్ సభ నియమావళికి విరుద్ధంగా ఉందని, ఆయన నేతృత్వంలో జరిగే విచారణ పారదర్శకంగా ఉంటుందన్న నమ్మకం తమకు లేదంటూ బీజేపీ ఎంపీ, స్టాండింగ్ కమిటీలో సభ్యుడు కూడా అయిన నిశికాంత్ దుబే గురువారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీకే చెందిన మరో ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా థరూర్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. వీటిపై స్పీకర్ స్పందించడానికిముందే, లోక్ సభ సెక్రటేరియట్ ఫేస్ బుక్ కు సమన్లు జారీ చేయడం విశేషం.

ఎన్నికల వేళ అమెరికాలో అనూహ్యం - ట్రంప్ అనుంగుడు స్టీవ్ బానన్ అరెస్ట్ - గోడ నిధుల్లో గోల్‌మాల్

  Donald Trump : Facebook Twitter Removed Donald Trump's Post Over False Claim || Oneindia Telugu

  సెప్టెంబర్ 2నాటి విచారణలో ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. ఫేస్ బుక్ వివాదంతోపాటు ఇంటర్నెట్ సేవల నిలిపివేత అంశాన్ని కూడా విచారించనుంది. ఇంటర్నెట్ అనేది దాదాపు ప్రాథమిక హక్కేనని, అకారణంగా నెట్ నిలిపివేతలు తగదంటూ గతంలో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన దరిమిలా ఈ అంశంపై కేంద్ర సమాచార, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖలనున స్టాండింగ్ కమిటీ ప్రశ్నించనుంది. ఇందు కోసం ఆయా శాఖలు జవాబులతో సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

  English summary
  The parliamentary standing committee on Information Technology has summoned Facebook on September 2 to discuss the issue of alleged misuse of social media platforms in the wake of claims that the United States firm did not apply hate speech rules to certain Bharatiya Janata Party politicians.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X