వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్వేషం, హింస భారతమాతకు మేలు చేయవు: ఈశాన్య ఢిల్లీలో రాహుల్ గాంధీ పర్యటన, ‘కరోనా’ అంటూ బీజేపీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హింస ఎవరికీ మేలు చేయదని, విద్వేషం, హింస అనేవి అభివద్ధికి, భారత మాతకు హాని చేస్తాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం ఇటీవల అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో బుదవారం పర్యటించారు. రాహుల్ వెంట పార్టీ నేతలు అధిర్ రంజన్ చౌదరి, రణదీప్ సింగ్ సుర్జేవాల, కుమారి షెల్జా, తదితరలు ఉన్నారు. ఇటీవల ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 47 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.

ఈశాన్య ఢిల్లీలో రాహుల్ పర్యటన..

రెండు బృందాలుగా కాంగ్రెస్ బృందాలు అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కువగా ఎంపీలు ఉన్న మొదటి ప్రతినిధుల బృందం కేరళ హౌస్ నుంచి బయల్దేరింది. హిబి ఈడెన్, గుర్జీత్ సింగ్ అజ్ల, అబ్దుల్ ఖలేఖ్ ఈ బృందంలో ఉన్నారు.
ఇక రెండో ప్రతినిధుల బృందం రాహుల్ గాంధీ నేతృతంలో బయల్దేరింది. కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి తదితరులు పర్యటించారు. ఘర్షణలకు మూలకారణంగా ఉన్న బ్రిజ్‌పురి ప్రాంతంలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో ధ్వంసమైన పాఠశాలను సందర్శించారు.

ద్వేషం, హింస అభివృద్ధికి, భారతమాతకు మేలు చేయవు

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ పాఠశాల ఢిల్లీ భవిష్యత్తు అని, ద్వేషం, హింసి దానిని నాశనం చేసిందన్నారు. ఈ ద్వేషం, హింస అభివృద్ధికి, భారతమాతకు ఎటువంటి ప్రయోజనం చేయవని అన్నారు. ఇలాంటి సమయంలో అంతా కలిసి ముందుకెళ్లాలని, దేశాన్ని అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.

ఇటలీ నుంచి వచ్చావు.. కరోనా టెస్ట్ చేయించుకున్నావా?

కాగా, రాహుల్ గాంధీ ఈశాన్య ఢిల్లీలో పర్యటించడంపై పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కేవలం ఆరు రోజుల ముందే రాహుల్ గాంధీ ఇటలీ నుంచి వచ్చారని.. విమానాశ్రయంలో ఆయన స్క్రీనింగ్ టెస్ట్ తీసుకున్నారా? లేదా అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రమేష్ బిదురి. రాహుల్ గాంధీ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడా? లేక వైరస్ వ్యాప్తి చేయాలనుకుంటున్నాడా? అని ఆయన నిలదీశారు.

English summary
Hate & Violence Enemies of Development, Won't Benefit 'BharatMata': Rahul after Visiting Riot-hit Areas of Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X