వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్రాస్ ఘటనతో... ఘజియాబాద్ లో బౌద్ధమతం స్వీకరించిన 236 మంది వాల్మీకీలు

|
Google Oneindia TeluguNews

హత్రాస్ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో కరేరా గ్రామంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వాల్మీకి సమాజంలోని 236 మంది సభ్యులు కుల వివక్ష నుండి తప్పించుకోవడం కోసం, హత్రాస్ ఘటన నేపథ్యంలో తమ కులంపై ఉన్నత కులాల వారి దాడులను నివారించడం కోసం బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 236 మంది సభ్యులు 22 ప్రతిజ్ఞలను చదివి వారు బౌద్ధ మతం లోకి మారారు. వీరంతా రాజారత్న అంబేద్కర్ ఆధ్వర్యంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ట్లుగా తెలుస్తుంది

హత్రాస్ బాధిత కుటుంబానికి మూడంచెల రక్షణా వ్యవస్థ .. సుప్రీంకు వివరణ ఇచ్చిన యూపీ సర్కార్ హత్రాస్ బాధిత కుటుంబానికి మూడంచెల రక్షణా వ్యవస్థ .. సుప్రీంకు వివరణ ఇచ్చిన యూపీ సర్కార్

 . వివక్ష తట్టుకోలేక బౌద్ధ మతం స్వీకరించిన వాల్మీకీలు

. వివక్ష తట్టుకోలేక బౌద్ధ మతం స్వీకరించిన వాల్మీకీలు

కరేరా గ్రామంలో మెజారిటీగా ఉన్న ఉన్నత కులాల వారు ముఖ్యంగా చౌహాన్ల నుండి దళితులుగా ఉన్న వాల్మీకులు వివక్షను ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తున్నారు. కరేరా గ్రామంలో 9 వేల మంది జనాభా ఉంది. వీరిలో ఐదు వేలమంది చౌహాన్లు , రెండు వేల మంది వాల్మీకీలు . మిగిలిన వారు ఇతర ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిన వ్యక్తులు. హత్రాస్ లో జరిగిన సామూహిక అత్యాచార సంఘటన తర్వాత అసలే వివక్షతో జీవనం సాగిస్తున్న తమను ఎవరూ అంగీకరించడం లేదని, బౌద్ధ మతాన్ని స్వీకరించి శాంతియుతంగా జీవనం సాగించాలని అనుకుంటున్నామని వారు పేర్కొన్నారు.

హత్రాస్ ఘటన తర్వాత పెరిగిన కుల వివక్షను భరించలేమంటూ

హత్రాస్ ఘటన తర్వాత పెరిగిన కుల వివక్షను భరించలేమంటూ

తమను హిందువులు అంగీకరించరని, ముస్లింలు ఒప్పుకోరని , అణచివేతకు గురవుతున్నామని పేర్కొన్నవారు ఈ గ్రామంలో కుల వివక్ష చాలా సంవత్సరాలుగా సూక్ష్మంగా మారిందని, అయితే హత్రాస్ సంఘటన జరిగినప్పటి నుండి చౌహాన్లు బహిరంగంగా వారిపై విరుచుకుపడటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలోనే కుల వివక్ష నుండి బయటపడడానికి, శాంతియుత మార్గంలో జీవనం గడపడానికి, ఆత్మన్యూనతా భావం నుండి బయటపడడానికి వాల్మీకులు బౌద్ధమతం స్వీకరించినట్లుగా బి ఆర్ అంబేద్కర్ వారసులైన రాజారత్న అంబేద్కర్ పేర్కొన్నారు.

బుద్ధుడి మార్గంలో జీవనం సాగించేందుకు నిర్ణయం

బుద్ధుడి మార్గంలో జీవనం సాగించేందుకు నిర్ణయం


ఇది చాలా ముఖ్యమైన పరిణామమని అన్నారు

. హత్రాస్ సంఘటన తరువాత సెప్టెంబర్ 30 రాత్రి యుపి పోలీసులు బాధిత యువతి మృతదేహాన్ని దహనం చేసిన నాటినుండి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని, దళితుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని , ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని అన్నారు . అప్పటి నుండి తమ పరిస్థితి దారుణంగా ఉందని వాల్మీకులు వాపోతున్నారు. అందుకే అధికారికంగా బౌద్ధ మతాన్ని స్వీకరించి తమ జీవనాన్ని బుద్ధుడి మార్గంలో సాగించాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొన్నారు. హత్రాస్ ఘటన తర్వాత వాల్మీకులు పై కుల వివక్ష ఇప్పటికే కొనసాగుతుందన్న ఉదంతం తాజా పరిణామాలతో వెలుగులోకి వచ్చింది.

English summary
On 14 October, as many as 236 members of the Valmiki community in Karera village of Ghaziabad read out 22 pledges and changed their religion to Buddhism, all under the tutelage of Rajratna Ambedkar.The Valmikis, who are Dalits, allege discrimination on the part of the ‘upper-caste’ Chauhans, who are the majority in the village. they decided to change the religion with hathras incident .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X