• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Hathras యువతికి లైంగిక వేధింపులు-తండ్రి ఫిర్యాదు- సీన్ కట్ చేస్తే హత్య: వీడియో చూస్తే...!

|

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ అవేమీ తమకు పట్టనట్టుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. ఇక నేరాలు చేశాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వారి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు కొందరు. తాజాగా హత్రాస్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. లైంగిక దాడికి బలైన ఓ అమ్మాయి కథ గురించి తెలుసుకుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.. ఇంతకీ హత్రాస్‌లో ఏం జరిగింది..?

2018లో యువతికి లైంగిక వేధింపులు

ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో 2018లో ఓ అమ్మాయిపై లైంగిక దాడి జరిగింది. ఇది తెలుసుకున్న తండ్రి లైంగిక దాడికి తెగబడిన గౌరవ్ శర్మ అనే వ్యక్తిపై ఆ రోజే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు గౌరవ్ శర్మను అరెస్టు చేశారు. నెలరోజుల తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాడు గౌరవ్ శర్మ. గత కొన్ని రోజులుగా ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని కోరుతూ నిందితులు ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ఆ తండ్రి మాత్రం ససేమిరా అనడంతో అతన్ని హతమార్చేందుకు డిసైడ్ అయ్యారు. దీంతో సోమవారం రోజు సాయంత్రం ఆలయంకు వెళ్లిన బాధితురాలి తండ్రిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. తనకు న్యాయం చేయాలంటూ ఆ యువతి పోలీసులను వేడుకుంటున్న వీడియో బయటపడింది. ఈ దృశ్యం పలువురిని కలచివేసింది.

ఆలయంలో హత్యకు గురైన బాధితురాలి తండ్రి

ఆలయంలో హత్యకు గురైన బాధితురాలి తండ్రి


ఇక పోలీసుల కథనం ప్రకారం... సోమవారం రోజున మృతుడి ఇద్దరు కుమార్తెలు ఆలయంకు వెళ్లగా అక్కడికి నిందితుడు గౌరవ్ శర్మ భార్య మరియు అతని అత్త కూడా వచ్చారు. అయితే అప్పటికే కేసు వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు మరియు నిందితుడి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం జరుగుతుండగానే గౌరవ్ శర్మ మరియు బాధితురాలి తండ్రి ఆలయంకు చేరుకోవడం జరిగింది. వీరిద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వెంటనే గౌరవ్ శర్మ తనతో తెచ్చుకున్న తుపాకీతో బాధితురాలి తండ్రిని కాల్చేశాడు. రక్తపు మడుగులో పడిపోయిన తండ్రిని వెంటనే హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

 తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్న యువతి

తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్న యువతి

తండ్రి పరిస్థితిని తెలుసుకునేందుకు హాస్పిటల్‌కు వెళ్లిన బాధితురాలికి తండ్రి మరణించాడనే విషయం తెలియడంతో కన్నీటిపర్యంతమైంది. హాస్పిటల్ బయటకు వచ్చి గట్టిగా ఏడ్చేసింది. రెండు చేతులూ జోడించి పోలీసులు నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ వేడుకుంది. ఈ దృశ్యం పలువురిని కలచివేసింది. ముందుగా గౌరవ్ శర్మ తనను లైంగికంగా వేధించాడని ఆ యువతి చెప్పుకొచ్చింది. తన తండ్రి గౌరవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడంతో కక్షగట్టి అతన్ని హత్య చేశాడని ఆ యువతి వెల్లడించింది. అక్కడే ఉన్న కొందరు ఈ వీడియోను చిత్రీకరించారు. పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న గౌరవ్ శర్మ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

యోగీ సర్కార్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్

యోగీ సర్కార్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్

నిందితులను కఠినంగా శిక్షించాలని యువతి వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ యోగీ ప్రభుత్వంపై విరుచుకుపడింది.రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని మండిపడింది. ఇకనైనా యోగీ ఆదిత్యనాథ్ నిద్రమేల్కోవాలని సూచించింది. బాధితురాలి వ్యధ వినాలని ఆమె చెబుతున్న నిందితుడిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తారా లేక బాధితురాలి పైనే ఆ నింద వేస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్.

English summary
A video surfaced on internet where a girl from Hathras district in UP was seen begging for justice after her father was killed for lodging a complaint against molestation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X