వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలించిన చర్చలు : రాజీనామాలు వెనక్కితీసుకుంటామన్న ఇద్దరు ఎమ్మెల్యేలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్ణాటక రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బలపరీక్ష కోసం హర్స్ ట్రేడింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. 16 మంది ఎమ్మెల్యేల రాజీనామా చేసినా .. బలపరీక్షకు సిద్ధమని సీఎం కుమారస్వామి ప్రకటించడంతో నిన్ననే క్యాంపు రాజకీయాలు మొదలైన సంగతి తెలిసిందే. రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రక్రియ కొనసాగుతుండటంతో అధికార పార్టీకి కాస్త పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి.

Have decided to stay in Congress, says rebel MLA Nagaraj

బుజ్జగింపుల పర్వం
రెబల్ ఎమ్మెల్యే నాగరాజుతో ట్రబుల్ షూటర్, మంత్రి డీకే శివకుమార్ ఇవాళ ఉదయం నుంచి చర్చలు జరిపారు. వారి డిమాండ్లను తీర్చేందుకు సానుకూలమని, తమతో కలిసి రావాలని బుజ్జగించారు. దీంతో వారి వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపించింది. తాము కాంగ్రెస్ పార్టీలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు నాగరాజు తెలిపారు. దీంతో డీకే శివకుమార్ సహా సిద్ధరామయ్య, ఇతర నేతలు చర్చలు ఫలప్రదం అయినట్టు పరిస్థితి కనిపిస్తోంది.

ఇటీవల 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వారిలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా .. ముగ్గురు జేడీఎస్ సభ్యులు. దీంతో రెబల్ ఎమ్మెల్యేలకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. వారి డిమాండ్లకు స్పష్టమైన హామీని ఇస్తున్నారు. దీంతో నాగరాజు స్వరం మారింది. తాను, సుధాకర్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నామని, కానీ పార్టీ పెద్దల విజ్ఞప్తితో పార్టీలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అంతేకాదు తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. బలపరీక్ష సమయానికి మరికొందరు ఎమ్మెల్యేలు తిరిగి సంకీర్ణ సర్కార్ గూటికి చేరతారని సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.

English summary
Congress MLA MTB Nagaraj on Saturday said, "I and Sudhakar had given resignation from MLA's post. All the leaders are asking me to stay in Congress since morning. I have decided to stay in the party."He also said, "We will try to convince Sudhakar and both of us will take our resignation back."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X