వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ పుట్టిన రోజు: ప్రధాని మోడీ, మమతా బెనర్జీ శుభాకాంక్షలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేడు (మంగళవారం - 19 జూన్ 2018) ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 48వ పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలంటూ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

'కాంగ్రెస్‌ అధ్యక్షులు శ్రీ రాహుల్‌ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నారు. రాహుల్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి రాహుల్‌కు హార్ధిక శుభాకాంక్షలు అంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. అధినేత పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Have a long, healthy life: PM Modi extends birthday greetings to Rahul Gandhi

రాహుల్‌ 2017 డిసెంబరు 11న ఏకగ్రీవంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 2013 జనవరి నుంచి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. రాహుల్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇదే మొదటి పుట్టినరోజు. సోనియా గాంధీ దాదాపు పందొమ్మిదేళ్ల పాటు పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగారు. ఆ తర్వాత బాధ్యతలను రాహుల్‌కు అప్పగించారు.

English summary
Prime Minister Narendra Modi Tuesday extended birthday wishes to Congress chief Rahul Gandhi. “Birthday greetings to Congress President Shri Rahul Gandhi. I pray for his long and healthy life,” PM Modi wrote on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X