వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాత్రి యువతులు రావడం తప్పన్న నిందితుడిపై నిర్భయ తల్లిదండ్రుల ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో 2012 డిసెంబర్ నెలలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం ఘటన పైన.. నిందితుల్లో ఒకడైన ముఖేష్ స్టేట్‌మెంట్ పైన నిర్భయ తండ్రి మంగళవారం స్పందించారు.

తాను తన పిల్లలకు సొంతగా బతకడం నేర్పానని వ్యాఖ్యానించారు. నిందితుడు ముఖేష్ సింగ్ చెబుతున్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఎప్పుడు కూడా సొంతగా ఆలోచించాలని, నిలబడాలని తమ పిల్లలకు నేర్పామని చెప్పారు.

మన న్యాయవ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు. నేరం చేసిన వాళ్లకు కఠినమైన శిక్షలు విధించాలన్నారు. లేదంటే ముఖేష్ సింగ్ లాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు.

Have taught my children to stand up for themselves, says Nirbhaya's father

నిందితుడు ముఖేష్ సింగ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వాన్ని చెబుతున్నాయని నిర్భయ తల్లి అన్నారు. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని తాము న్యాయ వ్యవస్థను, ప్రభుత్వాన్ని కోరుతున్నామని, అప్పుడే తమ లాంటి తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని అన్నారు.

కాగా, నిర్భయ కేసులో నిందితుడైన ముఖేష్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ యువతి పైన అత్యాచారానికి రేప్ చేసిన వాడి కంటే ఆమెదే ఎక్కువ బాధ్యత అని నిందించాడు. పురుషులకు సంబంధించిన ముఠా ఆకర్షణకు గురి కావడం అనేది రాత్రి పూట బయటకు వచ్చే యువతులదే తప్పు అని అతను అన్నాడు. అతని వ్యాఖ్యల పైన అందరు భగ్గముంటున్నారు.

English summary
Have taught my children to stand up for themselves, says Nirbhaya's father after convict blames victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X