• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిగ్ డిక్లరేషన్: HBD CM Tejashwi -తమ్ముడు టిట్టూకు బర్త్ డే గిఫ్ట్ ఇదేనన్న తేజ్‌ప్రతాప్ యాదవ్

|

కరోనా విలయం, లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ పతనం తర్వాత జరిగిన తొలి సంగ్రామం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమికి చావుదెబ్బ తప్పేలా లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా.. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవే అంటూ ఆర్జేడీకే చెందిన తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. సోమవారం 32వ పుట్టినరోజు జరుపుకొంటున్న తేజస్వీకి శుభాకాంక్షలు చెబుతూ తేజ ప్రతాప్ చేసిన ట్వీట్లు, కామెంట్లపై జోరుగా చర్చ జరుగుతోంది.

  Bihar polls: Counting of votes begins for 243 Assembly constituencies

  ఏం మాట్లాడుతున్నావ్.. కేటీఆర్? -నువ్వు మగాడివి అయితే -ఆ పనికి ప్యాంట్ తడిసిపోద్ది: ఎంపీ అర్వింద్ఏం మాట్లాడుతున్నావ్.. కేటీఆర్? -నువ్వు మగాడివి అయితే -ఆ పనికి ప్యాంట్ తడిసిపోద్ది: ఎంపీ అర్వింద్

  టిట్టూ.. హ్యాపీ బర్త్ డే రా..

  టిట్టూ.. హ్యాపీ బర్త్ డే రా..

  మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం (నవంబర్ 10న) వెలువడనున్నాయి. ఇవాళ(సోమవారం) ఆర్జేడీ చీఫ్, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ పుట్టిన రోజు. ఫలితాల్లో మహాకూటమి ప్రభంజనం సృష్టించబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పేర్కొన్నాయి. దీంతో తేజస్వీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు, కీలక జాతీయ నేతలు తేజస్వీకి విషెస్ చెప్పారు. అందరిలోకీ అతని అన్న తేజ్ ప్రతాప్ యాదవ్.. ‘‘Happy Birthday tutu.. HBD CM Tejashwi'' అని చేసిన ట్వీట్ హైలైట్ గా నిలిచింది. అంతేకాదు..

  తేజస్వీకి అతి పెద్ద బర్త్ డే గిఫ్ట్

  తేజస్వీకి అతి పెద్ద బర్త్ డే గిఫ్ట్

  తమ్ముడు తేజస్వీని బీహార్ సీఎంగా ట్విటర్ లోనే డిక్లెర్ చేసిన తేజ్ ప్రతాప్.. ఆ తర్వాత పాట్నాలోని తమ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘తేజస్వీ పుట్టినరోజున మేం అతిపెద్ద బహుమతి ఇచ్చాం. తేజస్వీని సీఎం కుర్చి మీద కూర్చోబెట్టబోతున్నాం. ఇదే మేం అతడి పుట్టినరోజున ఇచ్చిన అతిపెద్ద కానుక'' అని అన్నారు. ప్రస్తుత సీఎం గురించి ప్రశ్నించగా, ‘‘నితీశ్ సర్కారును జనం ఇప్పటికే తిరస్కరించారు'' అని చెప్పుకొచ్చారు. అంతకుముందు ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకలో తేజ్ ప్రతాప్.. తన తమ్ముడు తేజస్వీకి స్వీట్లు తినిపించి, ఆశీర్వదించారు.

  ఉత్కంఠ భరితమా? వన్ సైడా?

  ఉత్కంఠ భరితమా? వన్ సైడా?

  బీహార్ లో ఎన్నికల ప్రచారం ఆద్యాంతం పోటాపోటీగా సాగినా.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మాత్రం ఉత్కఠ భరితంగా సాగుతుందా? వార్ వన్ సైడ్ అయిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ ఈసారి మహా కూటమిదే విజయమని తేల్చడంతో ఈ పరిస్థితి నెలకొంది. కానీ గతంలో చాలా సార్లు బీహార్ ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సందర్భాలున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో, సోషల్ డిస్టెన్సింగ్ నియమాల మేరకు ఎన్నికల సంఘం కౌంటింగ్ కేంద్రాలను పెంచింది. మొత్తం 38 జిల్లాలకుగానూ అత్యధికంగా 55 కౌంటింగ్ సెంటర్లు, 414 హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలలోపే ఫలితాల ట్రెండ్స్ వెల్లడయ్యే అవకాశముంది. బీహార్ ఎన్నికల ఫలితాల తాజా అప్ డేట్స్ కోసం ‘వన్ ఇండియా తెలుగు' వెబ్ సైట్ ను ఫాలో కాగలరు.

  బీజేపీ హిందువుల పార్టీనే -ధర్మానికి అడ్డొస్తే తొక్కేస్తాం -కేసీఆర్‌కు సమాధి: బండి సంజయ్ సంచలనంబీజేపీ హిందువుల పార్టీనే -ధర్మానికి అడ్డొస్తే తొక్కేస్తాం -కేసీఆర్‌కు సమాధి: బండి సంజయ్ సంచలనం

  English summary
  RJD leader Tej Pratap Yadav on Monday extended greetings to his younger brother and opposition's CM candidate Tejashwi Yadav on his birthday. Tejashwi is celebrating his 32nd birthday today. We've given a big gift to Tejashwi (on his birthday). He will sit on the chair of the CM. Nitish Kumar's govt has been decried by people says Tej Pratap Yadav.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X