వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించండి.. కర్ణాటక సర్కార్‌కు హైకోర్టు సూచన...

|
Google Oneindia TeluguNews

టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. టిప్పు జయంతి నిర్వహించబోమనే అంశాన్ని మరోసారి పరిశీలించాలని సూచించింది. దీనిపై రెండు నెలలో తమకు నివేదిక అందజేయాలని కోరింది.

కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర వేడుకలా నిర్వహిస్తున్నారు. 2014 నవంబర్ 10 తేదిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జయంతి వేడుకలను ప్రారంభించారు. అయితే దీనిని హిందుత్వ వాదులు తప్పుపట్టారు. ఇక ఇటీవల కర్ణాటక సీఎం పదవీ అదిష్టించిన యడియూరప్ప టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు సాంస్కృతిక శాక ఆదేశాలు కూడా జారీచేసింది. అయితే దానిని కొందరు సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఈ మేరకు స్పందించింది.

HC declines to stay Karnataka govt’s decision on Tipu Jayanti

2015, 2016లో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నిర్వహించారని.. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడేందుకు అని హైకోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ అభాయ్ శ్రీనివాస్ ఒకా, జస్టిస్ ఎస్ఆర్ కృష్ణ కుమార్ అభిప్రాయపాడ్డారు. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించబోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని.. ఆ అంశాన్ని పరిశీలించాలని కోరినట్టు తెలిపారు. అయితే ఇతరులు వ్యక్తిగతంగా నిర్వహించుకోవచ్చని సూచించారు. ఆయాచోట్ల భద్రత కల్పించాల్సిన బాధత్య మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత సర్కార్‌దేనని గుర్తుచేశారు.

ఏటా నవంబర్ 10వ తేదీన టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి జూలైలోనే యడియూరప్ప నిర్ణయం తీసుకోవడం.. కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరో నాలుగురోజుల్లో జయంతి ఉన్న నేపథ్యంలో హైకోర్టు సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు అని.. అతని జయంతిని నిర్వహించబోమని చెప్పడం సరికాదని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విమర్శించారు.

English summary
Karnataka High Court declined to stay the State government’s decision to cancel celebration of Tipu Jayanti as a State event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X