వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగరం తగలబడిపోవాలా?: ఆ బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. ఆస్తుల నష్టంపై ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని నిలదీసింది. అల్లర్లు, హర్షణలు జరుగుతున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రశ్నించింది.

Delhi riots: కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి రూ. కోటి సాయం, భార్యకు ఉద్యోగంDelhi riots: కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి రూ. కోటి సాయం, భార్యకు ఉద్యోగం

కేసులు నమోదును ఎవరైనా అడ్డుకున్నారా?

కేసులు నమోదును ఎవరైనా అడ్డుకున్నారా?

నేతల విద్వేష ప్రసంగాల వీడియోలను హైకోర్టులో ప్రదర్శించారు పోలీసులు. దీంతో పోలీసులు సదరు నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. నేతలు చేసిన నినాదాలు ప్రజల్లో తప్పుడు సంకేతాలకు దారితీస్తాయని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంలో ఆలసత్వంపై జస్టిస్ మురళీధర్ సీరియస్ అయ్యారు.

కపిల్ మిశ్రాతోపాటు నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి

కపిల్ మిశ్రాతోపాటు నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి

ఢిల్లీ నగరంలో శాంతి భద్రతల కోసం విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన కపిల్ మిశ్రాతోపాటు ఇతర నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేగాక, కమిషనర్‌కు తమ సందేశాన్ని తెలియజేయాలని సొలిసిటర్ జనరల్‌కు సూచించింది.

నగరం తగలబడిపోయాక స్పందిస్తారా?

నగరం తగలబడిపోయాక స్పందిస్తారా?

ఏం జరుగుతుందో తెలియకుండా తాము కళ్లకు గంతలు కట్టుకుని ఏమీ లేమని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కేసు నమోదు చేయడానికి సరైన సమయం ఏంటి? ఎందరి ప్రాణాలు పోయిన తర్వాత కేసులు నమోదు చేస్తారని సొలిసిటర్ జనరల్‌ను కోర్టు నిలదీసింది. నగరమంతా మంటల్లో కాలిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? అని ప్రశ్నించింది. పోలీసులంటే బిజినెస్ అని చూపించాలనుకున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Recommended Video

World's 30 Most Polluted Cities : 21 Indian Cities, Ghaziabad Tops List | Oneindia Telugu
చట్టానికి ఎవరూ అతీతులు కారు..

చట్టానికి ఎవరూ అతీతులు కారు..


బీజేపీ నేతల మూడు వీడియో ప్రసంగాలను కమిషనర్‌కు చూపించాలని కోర్టు ఆదేశించింది. ఎవరూ చట్టానికి అతీతులు కాదని కోర్టు స్పష్టం చేసింది. లలిత కుమారి మార్గదర్శకాలను కమిషనర్ పరిగణలోకి తీసుకోవాల్సిందేనని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని.. వారేమీ పిక్నిక్ వెళ్లలేదని, వారి మీద యాసిడ్ దాడులు జరిగాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు.

English summary
HC Directs Police to File FIR against BJP Leader Kapil Mishra and ‘Others’ for Inflammatory Speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X