వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: హెచ్‌సిఎల్‌లో 5 వేల మందికి ఉద్యోగాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ ధిగ్గజం హెచ్‌సిఎల్ కొత్తగా 5 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రానున్న రోజుల్లో కొత్త వారికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

సాఫ్ట్‌వేర్ రంగం మందకొడిగా ఉన్న తరుణంలో హెచ్‌సిఎల్ టెక్కీలకు తీపికబురును అందించింది. కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద సుమారు 160 కోట్ల పెట్టుబడిని పెట్టాలని ఆ కంపెనీ నిర్ణయం తీసుకొంది.

సిఎస్ఆర్ కింద పెట్టుబడి కింద ఖర్చు చేసే రంగాల్లో కూడ ఉద్యోగులను నియమించుకొనే అవకాశం ఉందని హెచ్ సి ఎల్ ప్రకటించింది. రానున్న రోజుల్లో సుమారు 5 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.

హెచ్‌సిఎల్ లో 5 వేల ఉద్యోగాలు

హెచ్‌సిఎల్ లో 5 వేల ఉద్యోగాలు

ప్రముఖ ఐటీ సేవల దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా విద్య, ఆరోగ్యం, విద్యుత్ రంగాలలో భాగంగా రూ. 160 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ‍్యంలో రానున్న సంవత్సరాల్లో 5 వేల మందిని నియమించుకోనుంది. స్థానికులకు ప్రోత్సాహమిస్తూ వచ్చే ఏడాది మరో 2వేలమందిని రిక్రూట్‌ చేసుకుంటామని కంపెనీ ప్రకటించింది.

ఇప్పటికే 2 వేల ఉద్యోగాలు

ఇప్పటికే 2 వేల ఉద్యోగాలు

సీఎస్‌ఆర్‌లో భాగంగా రూ. 160 కోట్లు ఖర్చు చేస్తామని తద్వారా గ్రామాల అభివృద్ధికి సహాయపడనున్నామని యుపీ ఇన్వెస్టర్ సమ్మిట్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ప్రకటించారు. ఇందులో భాగంగానే 5వేల మందికి ఉద్యోగాలను ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ముఖ్యంగా టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ విభాగంలో ఇప్పటికే 2వేల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకొంటున్నట్టు చెప్పారు.

యూపీలో 700 గ్రామాల దత్తత

యూపీలో 700 గ్రామాల దత్తత

ఉత్తర్ ‌ప్రదేశ్ రాష్ట్రంలో 700 గ్రామాలను దత్తత తీసుకొన్నట్టుగా హెచ్‌సిఎల్ ప్రకటించారు.రాబోయే 12 నెలల్లో 2వేల ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తామన్నారు. ఉత్తర ప్రదేశ్లోని 700 గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా గ్రామస్తులకు వైద్య సదుపాయం, విద్యుత్‌, వ్యవసాయ ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ప్రకటించారు.

నలుగురితో ప్రారంభమైన సంస్థ

నలుగురితో ప్రారంభమైన సంస్థ

1976లో నోయిడాలో చైర్మన్ శివ్ నాడర్‌ తో కలిసి కేవలం నలుగురితో ప్రారంభమైన సంస్థలో ఇప్పుడు 1.2 లక్షల మందిపనిచేస్తున్నారనీ, 7.5 బిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా గుర్తు చేశారు. తమ లాభాల్లో కొంత మేరకు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమానికి రూప కల్పన చేసినట్టు సంజయ్ తెలిపారు.

English summary
IT major HCL TechnologiesBSE 2.53 % today said it will invest about Rs 160 crore as part of its corporate social responsibility activity in the field of education, health and power .The company will also be recruiting about 5,000 people in the years to come
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X