వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమారస్వామికి కొత్త చిక్కులు నిందితులకు సహకరించారని ఐటీ కేసులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్నాటక సీఎం కుమారస్వామికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మిత్రపక్షం మద్దతివ్వకపోవడంతో కొడుకు గెలుపు కోసం ఇప్పటికే నానా కష్టాలు పడుతున్న ఆయనకు తాజాగా ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఐటీ సోదాలకు సంబంధించి ముందుగానే సమాచారం ఇచ్చి నిందితులకు సహకరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెంగళూరు : కర్నాటక సీఎం కుమారస్వామికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మిత్రపక్షం మద్దతివ్వకపోవడంతో కొడుకు గెలుపు కోసం ఇప్పటికే నానా కష్టాలు పడుతున్న ఆయనకు తాజాగా ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఐటీ సోదాలకు సంబంధించి ముందుగానే సమాచారం ఇచ్చి నిందితులకు సహకరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

<strong>తల్లి, చెల్లి వెంటరాగ ఆమేథిలో రాహుల్ గాంధి నామినేషన్</strong>తల్లి, చెల్లి వెంటరాగ ఆమేథిలో రాహుల్ గాంధి నామినేషన్

మాటతప్పిన కుమారస్వామి

మాటతప్పిన కుమారస్వామి

గత నెలలో ఐటీ శాఖ కర్నాటకవ్యాప్తంగా కాంగ్రెస్, జేడీఎస్ నేతల సన్నిహితుల ఇళ్లలో దాడులు నిర్వహించింది. అయితే సోదాలకు సంబంధించిన సమాచారం ముందే తెలుసని కుమారస్వామి ప్రకటించారు. దీంతో ఆయన నిందితులను అలర్ట్ చేశారని ఐటీ శాఖ ఆరోపిస్తోంది. ఈ మేరకు కర్నాటక చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ డైరక్టర్ జనరల్ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బీఆర్ బాలకృష్ణన్‌తో పాటు రాష్ట్ర డీఐజీ నీలమణి రాజుకు ఫిర్యాదు చేశారు. కుమారస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

నాలుగు పేజీల ఫిర్యాదు

నాలుగు పేజీల ఫిర్యాదు

మార్చి 30వ తేదీన ఇచ్చిన నాలుగు పేజీల కంప్లైంట్‌లో సంజయ్ కుమార్ పలు అంశాలు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు ఐటీ అధికారులను బెదిరించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కారణంగానే సోదాల కోసం సీఆర్‌పీఎఫ్ సాయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా కుమారస్వామి ప్రమాణ స్వీకార సమయంలో చేసిన శపథాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐటీ అధికారుల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం

ఐటీ అధికారుల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం

కర్నాటకలో ఐటీ అధికారుల తీరుపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఆదాయపు పన్ను శాఖ తన అస్తిత్వాన్ని కోల్పోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దినేష్ రావ్ విమర్శించారు. అధికారపార్టీ సూచనల మేరకు ఐటీ శాఖ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.

English summary
The Income Tax department has filed a complaint against Karnataka Chief Minister HD Kumaraswamy, accusing him of breaking his oath of office by alerting financial offenders to impending raids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X