వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో హెచ్.డి. కుమారస్వామి, బీఎస్పీ చీఫ్ మాయవతి భేటీ, ఒక్క మంత్రిపదవి, ప్రభుత్వం !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, బహుజన సమాజ్ వాది పార్టీ ( బీఎస్పీ) చీఫ్ మాయవతి సోమవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. జేడీఎస్, బీఎస్పీ పొత్తు పెట్టుకుని కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశాయి.

మూడుసార్లు కర్ణాటకకు వచ్చిన మాయావతి జేడీఎస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. హెచ్.డి. కుమారస్వామి, మాయావతి భేటీలో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు, మంత్రి వర్గం ఏర్పాటు, కర్ణాటకలో బీఎస్పీ టిక్కెట్ పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యేకి మంత్రి పదవి తదితర విషయాలపై చర్చించారు.

HD Kumaraswamy met BSP leader Mayawathi in New Delhi today.

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో హెచ్.డి. కుమారస్వామి భేటీ అయ్యి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు, మంత్రి వర్గం విస్తరణ, ఎవరికి ఏ పదవులు అని చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్, గులాం నబి ఆజాద్ తదితరులతో హెచ్.డి. కుమారస్వామి భేటీ కానున్నారు. ఢిల్లీలో మకాం వేసిన హెచ్.డి. కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యి మంత్రి పదవులు, శాఖలు పంపిణి విషయంలో తుదినిర్ణయం తీసుకుని బెంగళూరు రానున్నారు.

English summary
HD Kumaraswamy met BSP leader Mayawathi in New Delhi today. BSP extended its support to JDS before the elections. Kumaraswamy meeting AICC president Rahul Gandhi also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X