వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంగా కుమారస్వామి ప్రమాణం, ఒకే వేదికపై సోనియా-చంద్రబాబు: బీజేపీ నిరసన దినం

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: 222 స్థానాలకు గాను కేవలం 38 చోట్ల గెలిచి, 180 స్థానాల్లో దారుణంగా ఓడిపోయిన జేడీఎస్ అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని బీజేపీ నిరసన దినంగా పాటిస్తోంది. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Recommended Video

కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావొద్దని బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలను పార్టీ వర్గాలు ఆదేశించాయి. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కార్ ఏర్పాటు కానున్న బుధవారం నాడు ప్రజా తీర్పు వ్యతిరేక దినాన్ని బీజేపీ కర్ణాటక వ్యాప్తంగా పాటించనుంది. దీనికి యడ్యూరప్ప నాయకత్వం వహిస్తున్నారు.

రాహుల్ గాంధీ, చంద్రబాబు రాక: బెంగళూరు వెళ్లి కేసీఆర్ వెంటనే రావడం వెనుక కారణాలు ఇవీ!రాహుల్ గాంధీ, చంద్రబాబు రాక: బెంగళూరు వెళ్లి కేసీఆర్ వెంటనే రావడం వెనుక కారణాలు ఇవీ!

కుమారస్వామి ప్రమాణ స్వీకరణ

కర్ణాటక రాష్ట్రానికి 24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విధాన సౌధ తూర్పు ద్వారా మెట్లపై సంకీర్ణ ప్రభుత్వ సారథిగా, సీఎంగా ఆయన ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. బలపరీక్ష అనంతరం మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు.

స్పీకర్‌గా తెలుగు మూలాలు ఉన్న ప్రజాప్రతినిధి

స్పీకర్‌గా తెలుగు మూలాలు ఉన్న ప్రజాప్రతినిధి

కుమారస్వామి కేబినెట్లో 22 స్థానాలు కాంగ్రెస్‌ను, 12 మంత్రి పదవులను జేడీఎస్‌‌ను వరించాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. స్పీకర్‌గా మాజీ మంత్రి, మాజీ సభాపతి రమేశ్‌కుమార్‌ మరో మారు వ్యవహరిస్తారు. తెలుగు మూలాలున్న ఆయన చిత్తూరుజిల్లా సరిహద్దు నియోజకవర్గం శ్రీనివాసపురం నుంచి విజయం సాధించారు. ఉపసభాపతి, మరో ఉపముఖ్యమంత్రిగా జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బాధ్యతల్ని చేపడతారు.

ప్రమాణ స్వీకరణ ఇలా

కుమారస్వామి బుధవారం ఉదయం మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎప్పుడూ ప్యాంటు, చొక్కాలో కనిపించే కుమారస్వామి బుధవారం పట్టు పంచె, పట్టు చొక్కా ధరించి పాదరక్షలు లేకుండా ప్రమాణ స్వీకరణ చేయనున్నారని తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతానని కుమారస్వామి అన్నారు.

ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు


కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు మూడువేల మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు రానున్నారు. వారు కూర్చునేందుకు కుర్చీలు సిద్ధం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన లక్షలాది మంది కార్యకర్తలు చూసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, పినరాయి విజయన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, మాయావతి, కమల్ హాసన్, స్టాలిన్ తదితరులు వచ్చే అవకాశముంది.

శివసేనకు ఆహ్వానం, డుమ్మా

శివసేనకు కూడా ఆహ్వానం అందింది. కానీ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే గైర్హాజరవుతున్నారు. తమ పార్టీ అధినేత ఉద్ధవ్‌ను దేవేగౌడ ఆహ్వానించారని, కానీ తాము పల్గార్ లోకసభ ఎన్నికల్లో బిజీగా ఉన్నామని, కాబట్టి హాజరు కావడం లేదని శివసేన నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా గైర్హాజరవుతున్నారు.

English summary
BJP has maintained that Congress-JDS do not have people's support as the two parties finished a distant second and third in the Karnataka elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X