బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ప్రధాని మనుమడు, హీరో ఉప ఎన్నికల్లో పోటీ ?, నాడు సుమలత దెబ్బకు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: గత లోక్ సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి పోటీ చేసి బహుబాష నటి, తెలుగింటి ఆడపడుచు సుమలత చేలితో దానుణంగా ఓడిపోయిన మాజీ ప్రధాని మనుమడు, మాజీ సీఎం కొడుకు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారని వెలుగు చూసింది. అయితే నిఖిల్ కుమారస్వామి ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారు అనే విషయంలో జేడీఎస్ వర్గాలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి మాత్రం నిఖిల్ కుమారస్వామికి చేదు అనుభవం ఎదురుకాకుండా చూడాలని మాజీ సీఎం కుమారస్వామి పక్కా ప్లాన్ వేస్తున్నారని తెలిసింది.

అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!

కొడుకు కోసం కుమారస్వామి

కొడుకు కోసం కుమారస్వామి

మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి ఎలాగైనా తన కొడుకు నిఖిల్ కుమారస్వామికి రాజకీయ జన్మ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిఖిల్ కుమారస్వామిని ఎలాగైనా ఉప ఎన్నికల్లో పోటీ చేయించి ఎమ్మెల్యేని చెయ్యాలని ఆయన సన్నిహితుల దగ్గర కుమారస్వామి చెప్పారని సమాచారం. 15 శాసన సభ నియోజక వర్గాల్లో సరైన నియోజక వర్గం ఎంపిక చేసి నిఖిల్ కుమారస్వామిని పోటీ చేయించాలని జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

హీరో రాజకీయ భవిష్యత్తు !

హీరో రాజకీయ భవిష్యత్తు !

తన కొడుకు నిఖిల్ కుమారస్వామిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ తీసుకురావాలని చాలమంది ఎమ్మెల్యేలు, నాయకులు చెబుతున్నారని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. అయితే మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబ సభ్యులు ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యరని నిన్న (సోమవారం) మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. అయితే నిఖిల్ కుమారస్వామికి మరో అవకాశం ఇస్తామని మాజీ సీఎం కుమారస్వామి మొదటి నుంచి అంటున్నారు.

చిక్కబళ్లాపురం మంచి చాన్స్

చిక్కబళ్లాపురం మంచి చాన్స్

ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని చిక్కబళ్లాపురం నియోజక వర్గం నుంచి నిఖిల్ కుమారస్వామిని పోటీ చేయించాలని, ఆయన్ను తాము గెలిపించుకుంటామని దేవనహళ్ళి ఎమ్మెల్యే నిసర్గ నారాయణస్వామి మాజీ సీఎం కుమారస్వామికి మనవి చేశారు. నిసర్గ నారాయణస్వామితో పాటు అనేక వర్గాల నుంచి నిఖిల్ కుమారస్వామిని చిక్కబళ్లాపురం నుంచి పోటీ చేయించాలని కుమారస్వామి మీద ఒత్తిడి పెరుగుతోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు

సిట్టింగ్ ఎమ్మెల్యేలు

15 శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో మూడు నియోజక వర్గాల నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేలు గతంలో గెలిచారు. కేఆర్ పేట్, మహాలక్ష్మి లేఔట్ (బెంగళూరు), హుణసూరు నియోజక వర్గాల్లో జేడీఎస్ కు మంచి పట్టు ఉంది. ఈ నియోజక వర్గం ఎమ్మెల్యేలు హెచ్. విశ్వనాథ్, నారాయణగౌడ, కే. గొపాలయ్య జేడీఎస్ మీద తిరుగుబాటు చేసి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఈ మూడు నియోజక వర్గాల్లో ఎక్కడో ఒక చోట నుంచి నిఖిల్ కుమారస్వామిని పోటీ చేయించాలని జేడీఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

ఒక్కలిగుల కులం

ఒక్కలిగుల కులం

చిక్కబళ్లాపురంలో ఎవ్వరు గెలవాలన్నా ఒక్కలిగుల ఓట్లు కీలకం అయ్యాయి. నిఖిల్ కుమారస్వామిని చిక్కబళ్లాపురం నుంచి పోటీ చేయిస్తే ఒక్కలిగుల ఓట్లు మనకే పడుతాయని జేడఎస్ వర్గాల అంచనా. గత లోక్ సభ ఎన్నికల సమయంలో చిక్కబళ్లాపురం నుంచి నిఖిల్ కుమారస్వామిని పోటీ చేయించాలని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో నిఖిల్ కుమారస్వామి మండ్య నుంచి పోటీ చేసి సుమలత చేతిలో ఓడిపోయారు.

English summary
Karnataka former CM HD Kumaraswamy son Nikhil Kumaraswamy may contest by election. Kumaraswamy kept eye on Hunsuru, Chikkaballapura, KR Pete for his son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X