వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమారస్వామి రికార్డ్: సీఎంగా 82 రోజుల్లో 40 ఆలయాల సందర్శన

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జేడీఎస్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన 82 రోజుల పదవీ కాలంలో 40 ఆలయాలను సందర్శించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి దాదాపు మూడు నెలలు అవుతోంది. ఈ కాలంలో... ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 82 రోజుల్లో నలభై గుళ్లకు వెళ్లారు.

సోమవారం ఆయన హరదనహళ్లిలోని ఈశ్వరాలయాన్ని సందర్శించారు. హసన్ జిల్లాలోని హోలెనరసిపుర తాలుకాలోని మరో నాలుగు ఆలయాలను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా అతి కాలంలో ఎక్కువ ఆలయాలను సందర్శించి రికార్డ్ సృష్టించారు.

కుమారస్వామి మే 23వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నాటి నుంచి ఆయన సరాసరిన రెండ్రోజులకు ఓసారి 34 ఆలయాలకు వెళ్లారు.

HD Kumaraswamy visits 40 temples in 82 days

సోమవారం కర్ణాటకలోని హరదనహళ్లి ప్రాంతంలోని ఈశ్వరాలయంతో పాటు హస్సన్‌ జిల్లాలోని మరో ఐదు ఆలయాలకు వెళ్లారు. దీంతో పాటు మైసూరులోని అడిచుంచనగిరి మఠంతో పాటు మరో ఆరు మఠాలను సందర్శించారు. ఇలా మొత్తం 40 ఆలయాలను సందర్శించినట్లయింది.

మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఇలా ఆలయాలకు సందర్శించారు. కాగా, మాజీ ప్రధాని దేవెగౌడ రాజకీయాల్లోకి వచ్చాక జోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు. ఆయనకు భక్తీ ఎక్కువే. కుమారస్వామి మాత్రం భిన్నంగా ఉండేవారు. కానీ గత కొన్నేళ్లలో ఆయనలో మార్పు వచ్చింది. ఆలయాలకు వెళ్లడం ప్రారంభించారట.

English summary
H D Kumaraswamy, who took oath as Karnataka chief minister on May 23, has set a record within 82 days of his tenure by visiting around 40 temples. This means that the chief minister visited a temple every alternate day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X