వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకెన్ని రోజులు: HDFC బ్యాంకు కస్టమర్లకు తప్పని తిప్పలు...పనిచేయని మొబైల్ బ్యాంకింగ్ యాప్

|
Google Oneindia TeluguNews

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌ఢీఎఫ్‌సీ వినియోగదారులు మొబైల్ యాప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా మొబైల్ యాప్ పనిచేయకపోవడంతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారి అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వెల్లగక్కుతున్నారు. అంతేకాదు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న యాజమాన్యం ఆరురోజులు అయినప్పటికీ సమస్యను పరిష్కారం చేద్దామన్న ఆలోచన ఇంతవరకూ చేయలేదు. యాప్ పనిచేయకపోవడంతో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ల నుంచి యాప్‌ను తొలగించడం జరిగింది.

ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదారులకు ఎలాంటి మొబైల్ యాప్ అందుబాటులో లేదు. కనీసం పాత యాప్‌ను కూడా యాజమాన్యం ప్లేస్టోర్‌లో అప్‌లోడ్ చేయలేదు. దీంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదొర్కొంటున్నారు. ఇక హిందీలో యాప్‌ వినియోగిస్తున్న కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రివ్యూలు చూస్తే వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుంది. అంతేకాదు వెంటనే ఇంగ్లీష్ యాప్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే నవంబర్ 29న బ్యాంకు యాజమాన్యం ట్విటర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పాత యాప్‌ను డిలీట్ చేసుకున్న కస్టమర్లు బ్యాంకు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్త యాప్‌ను వినియోగించుకునే అవకాశం ఉండదని పేర్కొంది.

 HDFC Banks new mobile app malfunction unfixed for over 6 days: Users

కస్టమర్ల ఇతర హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించి ఇతర సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, పేజాప్,మొబైల్ వాలెట్, మిస్డ్‌కాల్ బ్యాంకింగ్‌ లాంటి సేవలు వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే ఈ సేవలతో కస్టమర్లు సంతృప్తిగా లేరు ఎందుకంటే వారి ప్రతి లావాదేవీలు చాలా సులభంగా తక్కువ సమయంలో మొబైల్ యాప్‌ ద్వారానే చేస్తారు. ఇదిలా ఉంటే యాప్ ఎందుకు పనిచేయడం లేదో అన్న కారణం మాత్రం యాజమాన్యం ఇప్పటివరకు తెలపలేదు. ఇక గత కొన్ని రోజులుగా కస్టమర్లు కొత్త యాప్‌ను వినియోగించేందుకు ఓపెన్ చేస్తే "Sorry, we are experiencing high traffic on our servers. Please try again after some time." అని వస్తున్న మెసేజ్ చూసి విసిగెత్తిపోతున్నారు.

English summary
Customers of HDFC Bank have taken to Twitter to complain about the private lender's mobile app dysfunctioning since the app's launch on Thursday. The issue has not been fixed even over six days of the glitch and the new application was pulled from Google and Apple stores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X