• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాలుక నాకమని బలవంతం, మంచంపై తోసి భగవంతుని ఆజ్ఞ అని!: ఫలహారీ లీలలు

|
  Falahari Baba Arrested : నాలుకతో నాకమని బలవంతం తర్వాత మంచంపై తోసి... | Oneindia Telugu

  జైపూర్: ఫలహారీ బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన 21ఏళ్ల లా విద్యార్థి బాబాపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

  గుర్మీత్ ఫినిష్.. ఇప్పుడు ఫలహార బాబా! లైంగిక దాడి కేసులో అరెస్టు చేసిన పోలీసులు!

  బాధితురాలు చెప్పిన వివరాలు బాబా జుగుప్సాకరమైన కామ వాంఛల్ని బయటపెడుతున్నాయి. భక్తి ముసుగులో మహిళల పట్ల బాబా ఎంత నీచంగా ప్రవర్తించాడో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

  నాలుకను నాకమని చెప్పాడు:

  నాలుకను నాకమని చెప్పాడు:

  'నా నాలుకపై తేనెతో ఓం అనే బీజాక్షరం రాస్తా.. నువ్వు దానిని నాకితే నాలోని జ్ఞానం నీకు ప్రసారమవుతుంది. చాలామందికి ఇదే రీతిలో జ్ఞానాన్ని ప్రసాదించాను.. నువ్వు కూడా పొందు' అంటూ ఫలహారీ బాబా తనతో చెప్పినట్లు అత్యాచార బాధితురాలు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఆయన అనుగ్రహం, ఆశీర్వాదాలు పొందాలంటే నాలుకను నాకాల్సిందేనని పట్టుబట్టినట్లు ఆమె తెలిపింది.

  ఆరోజు ఏం జరిగింది?:

  ఆరోజు ఏం జరిగింది?:

  తనపై అత్యాచారం జరిగిన రోజు అగస్టు 7, సాయంత్రం 7.30గం. ప్రాంతంలో తొలుత తనను బాబా గదికి పిలిచారని బాధితురాలు చెప్పింది. తాను లోపలికి వెళ్లగానే శిష్యులను పంపించి తలుపులు మూసేశారని పేర్కొంది. అనంతరం తనను బలవంతంగా పట్టుకుని, కదలకుండా చేశాడని చెప్పుకొచ్చింది. భగవంతుడి ఆదేశం మేరకే ఇదంతా జరుగుతుందని చెబుతూ తనపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలిపింది.

  బెదిరింపులు:

  బెదిరింపులు:

  తనపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలోనే బయట నుంచి ఎవరో తలుపు కొట్టడంతో.. బాబా హడావిడిగా దుస్తులు ధరించారని బాధితురాలు తెలిపింది. విషయం బయటకు పొక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు పేర్కొంది. ఆ తర్వాతి రోజు బాబా అనుచరులు తనను రైల్వే స్టేషనులో వదిలి వెళ్లిపోయారని తెలియజేసింది.

  రాత్రికే అక్కడ ఉండమని:

  రాత్రికే అక్కడ ఉండమని:

  నిజానికి ఆగస్టు 7న ఆశ్రమానికి వెళ్లిన బాధితురాలు అదే రోజు తిరిగి వచ్చేయాలని అనుకుంది. కానీ ఆ రాత్రికి అక్కడే ఉండమని చెప్పడంతో బాబా మాట కాదనలేకపోయింది. తాను ఎంతోమందిని ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలను చేశానని, నిన్ను ఏకంగా జడ్జినే చేస్తానని బాబా తనతో చెప్పినట్లు బాధితురాలు తెలియజేసింది. అయితే దానికి ప్రతిఫలంగా ఏమిస్తావని అడిగిన బాబా.. తనను మంచంపై తోసేసి.. భగవంతుడి ఆజ్ఞ మేరకే ఇదంతా అని అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

  తల్లిదండ్రులకు చెప్పడంతో:

  తల్లిదండ్రులకు చెప్పడంతో:

  చాలారోజుల వరకు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయానని, చివరికి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితురాలు చెప్పుకొచ్చింది. కాగా, బాధితురాలి ఫిర్యాదుతో శనివారం కౌసలేంద్ర ప్రపన్నాచార్య అలియాస్ ఫలహారీ బాబా (60)ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు.

  English summary
  A 21-year-old law student of Chhattisgarh has accused an Alwar-based self-proclaimed sadhu of inviting her to lick his tongue as part of a ritual before sexually assaulting her.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X