• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రాణం మీదికొచ్చిన నూడుల్స్ చట్నీ .. వెంటిలేటర్‌పై చిన్నారి .. కారణమిదే ...

|

న్యూఢిల్లీ : చిరు తిండ్లంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. పప్స్, బర్గర్, గప్‌చిప్స్, నూడుల్స్ అంటే లొట్టలేసుకొని మరీ లాగించేస్తారు. అలా తినడమే ఓ చిన్నారి ప్రాణం మీదకి తీసుకొచ్చింది. వీధుల్లో విక్రయించే చిరు పదార్థాల్లో టేస్ట్ కోసం వారు కలిపే ఐటెమ్స్ వినియోగదారుల పాలిట శాఫంగా మారుతున్నాయి. స్నాక్స్ తిందామని ఉపక్రమిస్తే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది.

నూడుల్సే కదా ..?

నూడుల్సే కదా ..?

హర్యానాకు చెందిన మజూర్ తన కుమారుడు ఉస్మాన్‌కు గారాబం చేశాడు. అడిగిందల్లా కొనిచ్చేవాడు .. ఇక చిరుతిండ్ల సంగతి సరేసరి. దీంతో తమ ఇంటి పక్కన ఉండే నూడుల్స్ లాగించేవాడు ఉస్మాన్. అందులో వేసే చట్నీని మనోడు జుర్రేవాడు. దాదాపు 17 రోజుల క్రితం తన తండ్రి నూడుల్స్ తినిపించాడు. ఎప్పటిలాగే తిన్నాడు. కానీ చట్నీ వేస్ట్ చేయడం ఎందుకు అనుకున్నాడో తేలీదు గానీ .. మొత్తం తినేశాడు. తర్వాత ఇంటికి చేరుకొన్నారు. కానీ ఆ రాత్రి ఉస్మాన్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. తెల్లవారి ఉస్మాన్ శరీరం నీలం రంగులోకి మారిపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందారు.

క్రిటికల్ కండీషన్ ..

క్రిటికల్ కండీషన్ ..

బీపీ కూడా పడిపోయి .. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు పిల్లాడి ఊపిరితిత్తులు పాడయ్యాయని గుర్తించారు. వెంటనే అతడికి వెంటిలేటర్‌పై వైద్యం చేశారు. దాదాపు 16 రోజులపాటు ఐసీయూలో ఉంచితే కానీ పిల్లాడి ఆరోగ్యం కుదుటపడలేదు. వెంటిలేటర్‌పై ఉంచి .. క్షణ క్షణం గమనిస్తూ వైద్యం అందించడంతో ఎట్టకేలకు బాగైంది.

ఎందుకిలా ?

ఎందుకిలా ?

ఉస్మాన్ ఆరోగ్యం ఎందుకిలా సడెన్‌గా పాడైందని వైద్యులను అడిగితే విస్తుగొలిపే వాస్తవాలు బయటకొచ్చాయి. నూడుల్స్ కోసం తయారుచేసే చట్నీలో ఎసిటిక్ యాసిడ్ వాడారని తెలిపారు. సాధారణంగా వీధుల్లో లభించే పదార్థాలకు మరింత రుచి రావటానికి కొందరు ఎసిటిక్ ఆమ్లం వాడతారు. అలా హోటల్ యాజమాని వాడంతో .. పిల్లవాడి ప్రాణం మీదకి తీసుకొచ్చింది. అందులో పిల్లవాడు ఎక్కువ చట్నీ తీసుకోవడంతో శరీరంలో చేరి .. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mazur of Haryana made fun of his son Usman. Usman pulled the noodles next to their house. he ate noodles almost 17 days ago. But it is not clear why the chutney was wasted .. eaten whole. Then came home. But that night Usman's health condition serious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more