వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని కావాలని కోరుకోలేదు..! ప్రజలే నన్ను ప్రధాని కావాలనుకున్నారు..! సాహస యాత్రలో మోదీ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

MAN Vs WILD : Narendra Modi Shares Many Interesting Points With Bear Grylls || Oneindia Telugu

ఢిల్లీ/హైదరాబాద్ : మొదటి సారి దేశ ప్రదాని నరేంద్ర మోదీ మనసు విప్పి మాట్లాడారు. దేశంలో ఏ మీడియాతో, ఎప్పుడూ పంచుకోని కొన్ని మధుర స్కృతులను డిస్కవరీ ఛానల్ వేదికగా, సాహసికుడు బేర్ గ్రిల్స్‌ తో పంచుకున్నారు. ప్రధాని మోదీ అంతరంగాల్లో ఉన్న అనేక అంశాలను మోదీ బయటపెట్టారు. రాజకీయాల్లో తాను ఎన్నడూ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాలని కోరుకోలేదని, కాకపోతే గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని మాత్రం కోరుకున్నట్టు వెళ్లడించారు. ప్రదాని కావాలని ఎప్పుడూ కలలు కనలేదని, ప్రజలే తనను ప్రధానిగా చూడాలని కాంక్షించారని చెప్పుకొచ్చారు. రాజకీయ సుధీర్గ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్టు, ఓటిమి ఎదురైన సందర్బాల్లో కృంగి పోకుండా పడిలేచిన కెరటంలాగా దూసుకుపోయానని వివరించారు మోదీ.

 దిగ్విజయంగా ముగిసిన సాహస యాత్ర..! ఎన్నో అనుభవాలను పంచుకున్న ప్రధాని..!!

దిగ్విజయంగా ముగిసిన సాహస యాత్ర..! ఎన్నో అనుభవాలను పంచుకున్న ప్రధాని..!!

అరణ్య సాహసికుడు బేర్ గ్రిల్స్‌ ప్రధాని తో జరిపిన సాహస యాత్రలో నరేంద్ర మోదీ అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఉమ్మడి కుటుంభంలో ఉన్న ఔన్నత్యాన్ని, అహింస మార్గాన్ని, పడిలేచే కెరటాల సమర్ధతను, ప్రజల ఆకాంక్షలను, ప్రకృతిలో సంభవించే మార్పులను, వణ్య ప్రాణుల గురించి మోదీ సవివరంగా తన అభిప్రాయలను డిస్కవరీ ఛానల్ వేదికగా పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి భయమంటే ఏంటో తెలియదని, పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తొలి సారి సెలవు తీసుకున్నానని బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ చేపట్టిన సాహస యాత్ర మ్యాన్ వర్సెస్ వైల్డ్ సందర్భంగా అన్నారు.

 భయపడటం అంటే ఏంటో తెలియదు..! జీవితమే ఓ సాహసమన్న మోదీ..!!

భయపడటం అంటే ఏంటో తెలియదు..! జీవితమే ఓ సాహసమన్న మోదీ..!!

ఈ సాహస యాత్ర సోమవారం రాత్రి ప్రసారమైంది. ప్రముఖ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సాహస యాత్ర చేపట్టారు. 250 రాయల్‌ బెంగాల్‌ టైగర్లు సంచరించే చోట వీరిద్దరూ చేపట్టిన యాత్ర ఆసక్తి కలిగించింది. సోమవారం రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానెల్లో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' పేరిట ఈ షో ప్రసారమైంది. ఈ విషయాన్ని బేర్ గ్రిల్స్, ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సాహస యాత్రకు రావడాన్ని వెకేషన్‌గా భావిస్తే.. 18 ఏళ్లలో నేను సెలవు తీసుకోవడం ఇదే తొలిసారి అని మోదీ అన్నారు. వీరిద్దరూ అభయారణ్యంలో ఎవరూ వెళ్లని మార్గంలో ఐదు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లారు.

 ప్రకృతిని ప్రేమించాలి..! కాని దాని వినాశనంతోనే అనర్థాలన్న నమో..!!

ప్రకృతిని ప్రేమించాలి..! కాని దాని వినాశనంతోనే అనర్థాలన్న నమో..!!

ఈ సందర్భంగా బేర్ గ్రిల్స్ ప్రధాని మోదీకి కొన్ని ప్రశ్నలు సంధించారు. తనతో నడుస్తున్నప్పుడు నెర్వస్‌గా ఫీలవుతున్నారా అని మోదీని ప్రశ్నించారు. దీనికి ప్రధాని స్పందిస్తూ.. అధైర్యపడటం అనేది నా జీవితంలోనే లేదని తెలిపారు. నేనెప్పుడూ భయపడలేదన్నారు. జీవితంలో ఒడుదొడుకులు సహజమేనని.. ఒక్కోసారి పడిపోయినా మళ్లీ లేచి ఒక్కో మెట్టు పైకి ఎక్కాలని యువతకు సందేశమిచ్చారు. ప్రకృతిని ప్రేమించాలని దాన్ని నాశనం చేయొద్దని సూచించారు. మన స్వార్థం కోసం ప్రకృతిని విధ్వంసం చేయకుండా భావితరాల కోసం ఆలోచించాలన్నారు.

 ఉమ్మడి కుంటుంబం ఉన్నతంగా ఉంటుంది..! కుంటుంబాల ఔన్నత్యాన్ని చాటిన ప్రధాని..!!

ఉమ్మడి కుంటుంబం ఉన్నతంగా ఉంటుంది..! కుంటుంబాల ఔన్నత్యాన్ని చాటిన ప్రధాని..!!

అంతే కాకుండా ప్రపంచానికి భారత్ ఇచ్చే సందేశం వసుధైక కుటుంబం అనే భావన అని మోదీ తెలిపారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమన్నారు. మీరు ప్రధాని కావాలని కోరుకున్నారా..? అని బేర్ గ్రిల్ ప్రశ్నించగా.. నేను ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాను. గుజరాత్ సీఎంగా 13 ఏళ్లు పని చేశాను. ఆ తర్వాత దేశం నేను ప్రధాని కావాలని కోరుకుందన్నారు. తాడుతో కర్రకు కత్తిని కట్టిన బేర్ గ్రిల్స్.. ఏవైనా క్రూర మృగాలు దాడి చేస్తే వాటిని పొడిచేయండని సూచించారు. కానీ నేను జంతువులను చంపనని మోదీ చెప్పారు. ప్రకృతి ఎప్పుడూ మనకు ప్రమాదకరం కాదు. ప్రకృతితో సంఘర్షణే ప్రమాదకరం అన్నారు.

English summary
In the adventure of the Wild Adventurer bear grilles, Narendra Modi revealed many interesting points. On Discovery Channel, Modi shared his views on the superiority of the joint household, the path of non-violence, the efficacy of the waves, the aspirations of the people and the changes in nature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X