బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లవ్: కాలేజ్ అమ్మాయిపై అత్యాచారం, జైలు, బెయిల్, మళ్లీ రెండు సార్లు రేప్, నీకు దిక్కెవరు, లేపేస్తా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రేమ ముసుగులో పెళ్లి చేసుకుంటానని నమ్మించి కాలేజ్ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. రేప్ కేసులో జైలుకు వెళ్లిన యువకుడు తనను జైలుకు పంపించిన యువతి మీద కక్ష తీర్చుకోవాలని బెయిల్ మీద బటయకు వచ్చి మళ్లీ ఆమె మీద అత్యాచారం చేశాడు. రేప్ కేసు పెట్టి నన్ను జైలుకు పంపిస్తావా ? ఇప్పుడు మళ్లీ రేప్ చేశా, నీకు దిక్కున్న చోట చెప్పుకో, నన్ను మళ్లీ జైలుకు పంపిస్తే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ నిన్ను రేప్ చేస్తానని, నీతో పాటు మీ అమ్మ, అన్నను చంపేస్తానని కాలేజ్ అమ్మాయిని బెదిరించాడు. ఇప్పటికే యువతి మీద మూడు సార్లు రేప్ చేసి చంపేస్తానని బెదిరించి పరారైన వ్యక్తి కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు.

ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !

 పక్కింటిలో కాలేజ్ అమ్మాయి !

పక్కింటిలో కాలేజ్ అమ్మాయి !

బెంగళూరు నగరంలోని కోణనెకుంటలో కాలేజ్ అమ్మాయి (20) నివాసం ఉంటోంది. కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే అక్బర్ బాష అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అక్బర్ బాష కాలేజ్ అమ్మాయి వెంటపడ్డాడు.

 ప్రేమ ముసుగులో రేప్

ప్రేమ ముసుగులో రేప్

తనను ఎంతో ప్రేమిస్తున్నాడని, సంతోషంగా చూసుకుంటాడని, పెళ్లి చేసుకుంటాడని కాలేజ్ అమ్మాయి అక్బర్ బాషను నమ్మింది. అయితే ఓ సారి అక్బర్ బాష యువతి మీద బలవంతంగా అత్యాచారం చేశాడు. నిన్ను పెళ్లి చేసుకోనని అక్బర్ బాష ఎదురుతిరిగాడు. ఆ సమయంలో ఆవేదన చెందిన యువతి మోసం చేసిన అక్బర్ బాష మీద అత్యాచారం కేసు పెట్టడంతో కోణెనెకుంట పోలీసులు అక్బర్ బాషను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

 బెయిల్ మీద బయటకు వచ్చి రేప్

బెయిల్ మీద బయటకు వచ్చి రేప్

అత్యాచారం కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన అక్బర్ బాష కాలేజ్ నుంచి ఇంటికి వెలుతున్న యువతి మీద దాడి చేశాడు. తరువాత యువతి మీద అత్యాచారం చేసిన అక్బర్ బాష నువ్వు మళ్లీ కేసు పెడితో నీతో పాటు మీ అమ్మ, అన్నను చంపేస్తానని బెదిరించాడు. కాలేజ్ అమ్మాయి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అక్బర్ బాషను అరెస్టు చేసి మళ్లీ జైలుకు పంపించారు.

 ఏడాదికి బెయిల్, మళ్లీ రేప్

ఏడాదికి బెయిల్, మళ్లీ రేప్

యువతి మీద అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించిన అక్బర్ బాషను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. సంవత్సరం తరువాత ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన అక్బర్ బాష యువతి మీద పగతో రగిలిపోయాడు. యువతి మీద మళ్లీ అత్యాచారం చేసిన అక్బర్ బాష కేసు పెడితే చంపేస్తానని బెదిరించాడు. యువతి మీద అత్యాచారం చేసి పరారైన అక్బర్ బాష కోసం కోణెనెకుంట పోలీసులు గాలిస్తున్నారు.

English summary
The accused, who had gone to jail on charges of rape, raped the same Girl again in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X