వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం నిజాలు మాట్లాడుతున్నారనే.. అవమానకరంగా వేటాడుతున్నారు: ప్రియాంకాగాంధీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఏ క్షణాన్నయినా అరెస్టు చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ ను ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించిన నేపథ్యంలో.. చిదంబరం అరెస్టు తప్పనిసరిగా మారింది.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా చిదంబరానికి బాసటగా నిలిచారు. నిజాలు మాట్లాడుతున్న తమ నాయకుడి గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్వీట్ చేశారు.

దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్, రాజ్యసభ సభ్యుడైన చిదంబరం దశాబ్దాల కాలం పాటు సేవలు అందించారని, అలాంటి నాయకుడిని అత్యంత అవమానకరంగా వేటాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు చేస్తోన్న తప్పులను రాజ్యసభలో ఎత్తి చూపుతుండటం, నిజాన్ని ప్రజల ముందు ఉంచుతున్నందు వల్లే ఆయనను జైలుపాలు చేయడానికి కుయుక్తులు పన్నారని అన్నారు.

 He Is Being Shamefully Hunted Down: Priyanka Gandhi Backs P Chidambaram

ఆయన చెప్పే నిజాలను జీర్ణించుకోలేక అవమానకరంగా వేటాడుతున్నారని ధ్వజమెత్తారు, ఆరోపించారు. తమ పార్టీ నాయకుడికి ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటాడని, నిజాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని అన్నారు.

English summary
As former Union Minister P Chidambaram appeared to face arrest in a corruption investigation, Priyanka Gandhi Vadra tweeted in support of the senior Congress leader, alleging that he was being "shamefully hunted down" for speaking the truth.Investigating agencies have been on Mr Chidambaram's trail after a court yesterday denied him protection from arrest in a case in which he is accused of facilitating, as the country's Finance Minister, a huge infusion of foreign funds in the company INX Media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X