• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోటళ్లకు వెలుతున్నారా .. జర భద్రం... మీ శృంగార వీడియోలు ఆన్ లైన్ లో ప్రత్యేక్షం అవ్వొచ్చు!

|

సియోల్/ హైద‌రాబాద్ : హోట‌ల్ గ‌దుల్లో సుర‌క్షితంగా ఉండొచ్చు అనుకునే కొత్త జంట‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది. గ‌దిలో దూరాము కాదా ఇక మ‌న‌ల్ని ఎవ‌రు చూస్తారు అనుకుంటే బొక్క‌బార్లా ప‌డ్డ‌ట్టే..! గ‌దిలో దూరి త‌లుపేసుకుంటే ఇక మిమ్మ‌ల్ని, మీ శ్రుంగార జీవితాన్ని ప్ర‌పంచం చూస్తున్న‌ట్టే లెక్క‌. అదే ఆ హోట‌ల్ గొప్ప‌త‌నం. గ‌దిలోకి వెళ్లి త‌లుపేసుకున్నాక ప్ర‌పంచం చూడ‌డ‌మేమిటి అనుకుంటున్నారా..? ఐతే ఇది చ‌ద‌వండి.

హోటళ్లలో గదులు తీసుకొనే జంటలను ఓ ముఠా టార్గెట్‌ చేసుకుంది. వారి మధ్య జరిగే శృంగార కార్యకలాపాలను గుట్టుగా వీడియోలు తీసింది. దీనికోసం మిల్లీమీటరు మందంతో ఉన్న కెమెరాలను ఎవరికీ అనుమానం రాని రీతిలో టీవీ బాక్స్‌ల్లో, వాల్‌ సాకెట్లలో, హెయిర్‌ డ్రయ్యర్‌ హోల్డర్లలో అమర్చింది. ఆ వీడియోలను అన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ముఠా సభ్యులు భారీమొత్తంలో డబ్బులు సంపాదించిన వ్యవహారం దక్షిణ కొరియాలో వెలుగు చూసింది.

బర్ఖాదత్ కు అశ్లీల ఫొటోలు పంపిన కేసులో నలుగురి అరెస్టు

He is naughty..! secret camera in Hotel rooms..! 800 videos came out..!!

గతేడాది నవంబరు నుంచి ఈ తంతు సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల్లో 800కు పైగా జంటలు ఉన్నట్లు వారు చెబుతున్నా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందంటున్నారు. దేశంలోని పది నగరాల్లో ఉన్న 30వేర్వేరు హోటళ్లలోని 40గదుల్లో ఈ కెమెరాలను అమర్చినట్లు గుర్తించారు.వాటి సాయంతో గెస్ట్‌ల వీడియోలను రహస్యంగా రికార్డు చేశారు. నాలుగు వేల మందికి పైగా సభ్యులు ఉన్న ఓ వెబ్‌సైట్‌ వాటిని ప్రత్యక్ష ప్రసారం చేసింది.

వాటిని చూడటానికి సైట్‌ యాజమాన్యం సభ్యుల నుంచి భారీమొత్తం వసూలు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. కాగా, దక్షిణ కొరియాలోని మోటెల్స్‌లో తక్కువ ధరకే గదులు లభిస్తుండటంతో విదేశీయులతో పాటు పలువురు స్థానికులు కూడా వీటిలో దిగడానికి ప్రాధాన్యం ఇస్తారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రైవసీ కోరుకొనే యువతీ, యువకులు ఎక్కువగా ఇక్కడికే వస్తారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఈ ముఠా గదుల్లో రహస్య కెమెరాలు అమర్చింది. తమ దేశంలో రహస్య కెమెరాలను గుర్తించడం మొదటిసారేమీ కాదని, అయితే వాటిని ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం మాత్రం ఇదే తొలిసారని పోలీసులు చెప్ప‌కు రావ‌డం విశేషం..!!

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A gang targeted couples taking rooms in hotels. They took videos of their sex acts. For this purpose, the cameras with millimeter thickness are set up in TV boxes, wall sockets, and hair dryer holders that do not have any suspicion. In South Korea there was a huge deal that gang members paid a huge amount of money on online videos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more