వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమె కాదు అతనే ...కాని, అతని కడుపులో శిశువు పిండం...తొలగించిన వైద్యులు

ఆడవారి మాదిరిగానే ఓ యువకుడి కడుపులో ఉన్న పిండాన్ని భువనేశ్వర్ వైద్యులు తొలగించారు. తొలుత దీన్ని కణితిగా భావించినప్పటికీ, చివరికి దాన్ని శిశువు పిండంగా గుర్తించారు వైద్యులు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుత

By Narsimha
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్ : ఆడవారిలో ఉన్నట్టుగానే ఓ యువకుడి కడుపులో నుండి శిశువు పిండాన్ని వైద్యులు తొలగించారు. కణితిగా భావించి తొలగించిన వైద్యులు చివరకు దాన్ని శిశువు పిండంగా గుర్తించారు.

ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ జిల్లా జలేశ్వర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ళ యువకుడికి ఇటీవల కాలంలో విపరీతమైన కడుపునొప్పి వస్తోంది.ఈ బాధ భరించలేక ఆయన వైద్యులను సంప్రదించాడు. కడుపునొప్పితో పాటు గా పొత్తి కడుపు కూడ పెరగడాన్ని వైద్యులు గుర్తించారు.

కడుపులో కణితి పెరుగుతోందని, దీని కారణంగానే ఆ యువకుడు అనారోగ్యానికి గురయ్యాడని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ కణితిని తొలగించాలని నిర్ణయించారు. 10 రోజుల క్రితం ఈ కణితిని ఆరుగురు డాక్టర్ల బృందం ఆపరేషన్ చేసి తొలగించారు.

 he is not a lady...doctors remove a fetus in stomach

కణితి కాదు ...పిండం

కణితిని బయటకు తీసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. కణితి చిన్న శిశువు లాంటి ఆకారాన్ని పోలి ఉంది. శరీరంపై రోమాలు, కాళ్లు, చేతులు ఉండటాన్ని గమనించారు.దీంతో కణితిని పరీక్షల నిమిత్తం పంపారు. ఈ కణితి కాదని, శిశువు పిండమని ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యుడు తుషార్ సుభదర్శన్ మిశ్రా తెలిపారు.యువకుడి కడుపులో పిండం ఏర్పడడం జన్యుపరమైన కారణాల వల్లే జరిగి ఉంటుందని ఆయన చెప్పారు.

తల్లి గర్భంలో ఉన్న సమయంలో కవలలు ఏర్పడే క్రమంలో ఒక పిండం కడుపులో మరో పిండం ఉండిపోతోందని, దీన్ని వైద్య పరిభాషలో పిట్స్ ఇన్ పిటు అంటారని ఆయన చెప్పారు.ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా సంబవిస్తుంటాయని ఆయన చెప్పారు. శస్త్రచికిత్స పూర్తైన తర్వాత ఆ యువకుడు కోలుకొన్నాడని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

English summary
bhuvaneshwar doctors revmove fetus in young boy stomach . young boy belongs to balasore district jaleshwar village. recently his get stomach pain. he approached doctors. doctors examined him. doctors idettify tumer is in body.bhuvaneshwar doctors remove the tumer. after examine this tumer. doctors declred that is not a tumer... that is fetus. said doctors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X