వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంకు చుక్కెదరు: ఆయనో ‘కింగ్’, ఏమైనా చేయగలరన్న సీబీఐ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది.

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది. అక్రమాస్తుల కేసులో బెయిల్‌ కోరుతూ సీఎం వీరభద్రసింగ్‌, ఆయన భార్య పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం పాటియాలా హౌస్‌కోర్టులో విచారణ చేపట్టారు.

అక్రమాస్తుల కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని గతవారం వీరభద్రసింగ్‌ పాటియాలా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ దరఖాస్తుపై తమ స్పందన తెలియజేయాలని కేసును విచారిస్తున్న సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది.

He is the King of Himachal Pradesh, CBI says while opposing Virabhadra Singh's bail

ఇందుకు వారం గడువు ఇచ్చింది. దీంతో సీబీఐ సోమవారం తమ నివేదికను కోర్టుకు అందించింది. సీఎం, ఆయన భార్యకు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సీబీఐ నివేదికలో పేర్కొంది. బెయిల్‌ ఇస్తే.. కేసు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

'సీఎం వీరభద్రసింగ్‌కు రాష్ట్రంలో చాలా పరపతి ఉంది. రాష్ట్రానికి ఆయనో రాజు(కింగ్). అంతేగాక, అనేక అవినీతి కేసుల్లో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇక వైద్య పరమైన సమస్యలు అంటే అవి సాధారణమే. అందుకే ఆరోగ్య సమస్యల పరంగా ఆయనకు బెయిల్‌ ఇవ్వడం కుదరదు' అని సీబీఐ తేల్చి చెప్పింది.

English summary
The Central Bureau of Investigation has opposed the bail plea filed by Himachal Pradesh Chief Minister Virabhadra Singh, accused of corruption charges. The CBI in its application states that it opposes the bail granted to Singh and his wife in connection with a disproportionate assets case.
Read in English: CBI opposes bail plea filed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X