నా కూతురు రెచ్చగొట్టింది, అందుకే రేప్ చేశాను: హెడ్ కానిస్టేబుల్, అల్లుడికి తెలిసింది !
కన్న కూతురి మీద అత్యాచారం చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్రా-ఢిల్లీ యమునా ఎక్స్ ప్రెస్ వే లోని మధురలోని మంథ్ చౌకి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ .
ఆగ్రా: కన్న కూతురి మీద అత్యాచారం చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్రా-ఢిల్లీ యమునా ఎక్స్ ప్రెస్ వే లోని మధురలోని మంథ్ చౌకి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న బిజేంద్ర సింగ్ (58) అనే కామాంధుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
35 ఏళ్ల వివాహిత కుమార్తె మీద హెడ్ కానిస్టేబుల్ బిజేంద్ర సింగ్ అత్యాచారం చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. తన తండ్రి తన మీద అత్యాచారం చేశాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ మీద కేసు నమోదు చేశామని జిల్లా అడిషనల్ పోలీసు కమిషనర్ సంజయ్ కుమార్ సాగర్ తెలిపారు.
ఆమెకు ఇద్దరు పిల్లలు
బిజేంద్ర సింగ్ తన కుమార్తె కు పెళ్లి చేశాడు. ఆమె చండిగఢ్ లో భర్తతో నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లికి అనారోగ్యంతో బాధపడుతోందని తెలుసుకున్న ఆమె గత సోమవారం ఆగ్రా వచ్చి తన తల్లిని ఆసుపత్రిలో చేర్పించింది.
తండ్రిని కలిసింది
సోమవారం సాయంత్రం నేరుగా మధురలోని మంథ్ చౌకి పోలీస్ స్టేషన్ చేరుకుని తండ్రిని కలిసింది. విధులలో ఉన్న తండ్రి బిజేంద్ర సింగ్ తో కలిసిన తరువాత ఆమె నేరుగా ఇంటికి వెళ్లింది. తల్లి ఆసుపత్రిలో ఉండటంతో ఆమె ఒక్కటే ఇంటిలో ఉంది.
రెండు రోజులు రేప్ చేశాడు
ఇంటిలో ఒంటరిగా ఉన్న కుమార్తె మీద బిజేంద్ర సింగ్ ఈనెల 26, 27 తేదీల్లో రాత్రి పూట కుమార్తె మీద అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా బాధితురాలు ఊరిలో ఉన్న భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది.
Recommended Video
చితకబాదిన అల్లుడు
విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త మధుర చేరుకుని తన భార్య మీద అత్యాచారం చేసిన మామను చితకబాదేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బిజేంద్ర సింగ్ ను అరెస్టు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని పోలీసు అధికారి సంజయ్ కుమార్ సాగర్ చెప్పారు.
నా కూతురు రెచ్చగొట్టింది
బిజేంద్ర సింగ్ ఇదే నెల 30వ తేది రిటైడ్ కానున్నాడు. రిటైడ్ అయ్యి హాయిగా జీవితం గడపాల్సిన బిజేంద్ర సింగ్ కన్న కుమార్తె మీద అత్యాచారం చెయ్యడంతో సస్పెండ్ చేసి అరెస్టు చేశామని డిప్యూటి పోలీసు కమిషనర్ సంజయ్ కుమార్ సాగర్ చెప్పారు. అయితే తన సొంత కూతురు రెచ్చగొట్టడం వలనే తాను అత్యాచారం చేశానని నిందితుడు బిజేంద్ర సింగ్ పోలీసులకు చెప్పాడు.