వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామమందిర నిర్మాణానికి సమీపిస్తోన్న ముహూర్తం: కీలక నిర్ణయం: ఆ సాధువుకు జడ్ కేటగిరి భద్రత..!

|
Google Oneindia TeluguNews

లక్నో: హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించినట్టుగా భావిస్తోన్న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోంది. శతాబ్దాల నాటి రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదానికి గత ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందంటూ తీర్పు వెలువడించింది. ఈ స్థలాన్ని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు కేటాయించింది. దీనితో ఈ స్థలంలో రామమందిరం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన పడబోతోంది.

బిగ్ స్టేట్ మెంట్: నాలుగు నెలల్లో రామమందిరం: ఆకాశాన్నంటేలా..నభూతో అనిపించేలా: అమిత్ షా..!బిగ్ స్టేట్ మెంట్: నాలుగు నెలల్లో రామమందిరం: ఆకాశాన్నంటేలా..నభూతో అనిపించేలా: అమిత్ షా..!

న్యాస్ ట్రస్ట్ చీఫ్‌కు భారీ భద్రత..

న్యాస్ ట్రస్ట్ చీఫ్‌కు భారీ భద్రత..

ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ భద్రతను పెంచింది. జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తోంది. ఇదివరకు ఆయనకు వై ప్లస్ కేటగిరీ ఉండేది. దీని స్థాయిని పెంచింది ప్రభుత్వం. జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. రామమందిర నిర్మాణ పనులను చేపట్టాల్సి ఉన్న సమయంలో ఆయన భద్రతను పెంచడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

త్వరలో రామమందిర ట్రస్ట్ ప్రకటన..

త్వరలో రామమందిర ట్రస్ట్ ప్రకటన..


రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే రామమందిరం రూపుదిద్దుకోనుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే ఏప్రిల్ 2వ తేదీన అయోధ్యలో శంకుస్థాపన చేయనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ ట్రస్ట్ ఏర్పాటు కానుంది. న్యాస్ ట్రస్, రామ్‌లల్లా విరాజ్‌మాన్, విశ్వహిందూ పరిషత్, హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి హిందూ సంస్థల ప్రతినిధులకు ఈ ట్రస్టులో చోటు కల్పించనున్నారు.

16వ తేదీ తరువాత ఏరోజైనా..

16వ తేదీ తరువాత ఏరోజైనా..

రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన రాయి పడటానికి ముందే- రామమందిరం ట్రస్ట్ సభ్యుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కసరత్తు సాగుతోంది. ఈ ట్రస్టుకు మహంత్ నృత్య గోపాల్ దాస్ సారథ్యాన్ని వహించడం దాదాపు ఖాయమైంది. ఆయనకు కల్పిస్తోన్న భద్రతను పెంచడం ద్వారా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్టయింది. ఇక సభ్యులు ఎవరనే విషయం తేలాల్సి ఉంది. పూర్తి స్థాయి ట్రస్టు ఈ నెల 16వ తేదీ తరువాత ఏరోజైనా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.

 విశ్వహిందూ పరిషత్ విజ్ఞప్తి మేరకే..

విశ్వహిందూ పరిషత్ విజ్ఞప్తి మేరకే..

కాగా- విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కొందరు కీలక నాయకుల విజ్ఙప్తి మేరకే కేంద్ర ప్రభుత్వం.. మహంత్ నృత్య గోపాల్ దాస్‌కు కల్పించే భద్రతను పెంచినట్లు చెబుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యగా ఆయనకు ఈ భద్రతను కల్పించినట్లు చెబుతున్నారు. నృత్య గోపాల్ దాస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినా చేయొచ్చనే పక్కా సమాచారం ఉండటం వల్లే వీహెచ్‌పీ నాయకులు కేంద్రాన్ని సంప్రదించారని అంటున్నారు.

English summary
Head of Ram Janmbhoomi Nyas, Mahant Nritya Gopal Das' security has been upgraded from Y+ to Z, says Government Sources. In the head of Ram Mandir construction will began. Ram Mandir in Ayodhya likely to construction began on the Srirama Navami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X