వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ దాడులు: మంత్రి కుమార్తె పరీక్ష గోవింద, ఇంటి నుంచి పంపించం!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ సీఆర్ పీఎఫ్ అధికారులు, సిబ్బంది మీద విరుచుకుపడ్డారు. తన కుమార్తెను పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో అధికారుల తీరు సరిగా లేదని విమర్శించారు.

<strong>దినకరన్ కు ఫస్ట్ వార్నింగ్: ఐటీ దాడులు సాంపిల్ మాత్రమే, సీఎం కావాలంటే!</strong>దినకరన్ కు ఫస్ట్ వార్నింగ్: ఐటీ దాడులు సాంపిల్ మాత్రమే, సీఎం కావాలంటే!

శుక్రవారం వేకువ జామున నుంచి తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి విజయభాస్కర్ సన్నిహితులు, బంధువు ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తున్నారు.

Health minister Vijayabhaskar has slammed CRPF sleuths for not allwoing his child to attend the exams

మంత్రి విజయభాస్కర్ ఇంటి దగ్గర భారీ సంఖ్యలో సీఆర్ పీఎఫ్ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మంత్రి విజయభాస్కర్ కుమార్తె పరీక్ష రాయడానికి స్కూల్ కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి సీఆర్ పీఎఫ్ సిబ్బంది అంగీకరించలేదు.

<strong>ఇసుక క్వారీల కింగ్ తో లింకులు: అందుకే మంత్రి ఇంటిపై ఐటీ దాడులు!</strong>ఇసుక క్వారీల కింగ్ తో లింకులు: అందుకే మంత్రి ఇంటిపై ఐటీ దాడులు!

ఇదే సందర్బంలో ఇంటిలో ఉన్న మంత్రి విజయభాస్కర్ సీఆర్ పీఎఫ్ అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. మా అమ్మాయి పరీక్ష రాయకపోతే ఒక సంవత్సరం వృదా అవుతుందని మంత్రి విజయభాస్కర్ సీఆర్ పీఎఫ్ సిబ్బందికి చెప్పారు. అయితే మంత్రి కుమార్తెను ఇంటి నుంచి బయటకుపంపించడానికి ఆదాయ పన్ను శాఖ అధికారులు, సీఆర్ పీఎఫ్ సిబ్బంది నిరాకరించారు.

English summary
Tamil Nadu Health minister Vijayabhaskar has slammed CRPF sleuths for not allwoing his child to attend the exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X