వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రోనింగ్ : ఇలా చేస్తే కోవిడ్ పేషెంట్లు తేలిగ్గా శ్వాస తీసుకోవచ్చు... ఎలా చేయాలో తెలుసుకోండి..

|
Google Oneindia TeluguNews

నెల క్రితం వరకు దేశవ్యాప్తంగా స్తబ్దుగా ఉన్న కరోనా కేసులు ఒక్కసారిగా పెచ్చరిల్లాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా రెట్టింపయింది. దీంతో హెల్త్ కేర్ వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో ఆక్సిజన్ సపోర్ట్‌ అవసరమవుతున్న పేషెంట్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో చాలా ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పేషెంట్లు శ్వాస సమస్యను అధిగమించేలా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 'ప్రోనింగ్' ప్రక్రియ అవగాహన కల్పిస్తోంది. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లు ఈ ప్రక్రియ ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను అధిగమించవచ్చునని చెబుతోంది. ఇంతకీ ఏంటీ ప్రోనింగ్... దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం...

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 29 మంది మృతి.. హైదరాబాద్‌లో 63 కంటైన్‌మెంట్ జోన్లుతెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 29 మంది మృతి.. హైదరాబాద్‌లో 63 కంటైన్‌మెంట్ జోన్లు

ప్రోనింగ్ అంటే ఏమిటి...

శరీరంలో ఆక్సిజన్ స్థాయి 94 శాతం కన్నా పడిపోయినప్పుడు ప్రోనింగ్ విధానం ద్వారా తిరిగి ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చు. శరీరంలో ఆక్సిజనేషన్ మెరుగుపరిచేందుకు మెడికల్ పరంగా ఇది ఆమోదయోగ్యమైన ప్రక్రియ. దీన్ని చేసేందుకు నాలుగు లేదా ఐదు దిండ్లు(పిల్లో) అవసరం. మొదట బోర్లా పడుకుని... ఒక దిండుని మెడ కింద,ఒకటి లేదా రెండు దిండ్లు ఛాతీ కింద మరో రెండు దిండ్లు కాళ్ల కింద పెట్టుకోవాలి. అలా ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి పొజిషన్ మార్చాలి.

ఎలా చేయాలి...

ఎలా చేయాలి...

మొదట బోర్లా పడుకుని,ఆ తర్వాత కుడివైపుకు తిరిగి,ఆపై ఎడమవైపుకు తిరిగి ఇలా ఒక్కో పొజిషన్‌లో 30 నిమిషాల పాటు శ్వాస తీసుకోవాలి. తద్వారా శ్వాస తీసుకోవడం సులువవుతుంది. కాబట్టి కోవిడ్ పేషెంట్లు రెగ్యులర్‌గా ప్రోనింగ్ ప్రక్రియను అనుసరించడం మేలు చేస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే శరీరంలో ఆక్సిజన్ స్థాయి 94శాతం కన్నా తగ్గినప్పుడు మాత్రమే ప్రోనింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే హోం ఐసోలేషన్‌లో దీన్ని చేసేవారు శరీర ఉష్ణోగ్రత,బీపీ,సుగర్ వంటి వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

ఎవరెవరు చేయకూడదు...

ఎవరెవరు చేయకూడదు...

గర్భిణీ స్త్రీలు,నరాల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఉన్నవారు,గుండె సంబంధిత సమస్యలు,వెన్నెముక,కటి భాగంలో ఫ్రాక్చర్స్ ఉన్నవారు 'ప్రోనింగ్‌' చేయరాదు. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే ఇది చేయరాదు. సౌకర్యంగా అనిపిస్తేనే ప్రోనింగ్ చేయాలి. ఒకరోజులో పలుమార్లు రోజుకు 16 గంటలు ప్రోనింగ్ చేయవచ్చు. అయితే ప్రోనింగ్ సమయంలో శరీరం ఒత్తిడికి గురవుతోందా... ఏమైనా గాయాలవుతున్నాయా చూసుకోవాలి. మెడికల్ పరంగా ఇది ఆమోదయోగ్యమైన ప్రక్రియ. ప్రస్తుతం కోవిడ్ పేషెంట్లు చాలామంది ఆక్సిజన్ సమస్య ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్రం ఈ సూచనలు జారీ చేసింది.

English summary
Covid-19 patients who are being treated at home can practise proning if they are having breathing discomfort, the Union health ministry has said, releasing a detailed document explaining what proning is and how it helps in improving oxygenation. As the number of Covid-19 patients in the country is increasing rapidly, the hospitals are under stress. Doctors have advised self-monitoring of the oxygen level to understand whether there is a need for hospitalisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X