వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'7వేల ఏళ్ల కిందటే భారత్‌లో విమానాలు', 'భారత సంస్కృత గ్రంథాలతో జర్మన్ల టెక్నాలజీ'

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహర్షి భరద్వాజ విమానాల గురించి ఏడువేల సంవత్సరాలకు పూర్వమే చెప్పారని కెప్టెన్ ఆనంద్ బోడాస్ అన్నారు. భారతీయ శాస్త్ర విజ్ఞాన కాంగ్రెస్ 102వ వార్షికోత్సవ 2వ రోజైన ఆదివారంనాడు ఈ అధ్యయన కార్యక్రమం జరగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.

శతాబ్దాల పాటు సాగిన అత్యంత సూక్ష్మమైన అధ్యయనాల ప్రాతిపదికగా, ఇటు అనుభవం అటు సహేతుకత పునాదిగానే భారతీయ ప్రాచీన విజ్ఞాన సిద్ధాంతాలు ఆవిర్భవించాయని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. అప్పట్లో ఎలాంటి ఆధునిక సాధనాలు, యంత్రాలు లేనప్పటికీకూడా కేవలం అవగాహన, అధ్యయనం, అనుభవం, సహేతుకతే భారతీయ శాస్త్ర సిద్ధాంతాలను బలోపేతం చేసిందన్నారు.

Heard at science meet: Ancient Indian planes flew to planets

అందుకే భారతీయ ప్రాచీన విజ్ఞానానికి, శాస్త్ర పరిజ్ఞానానికి నేటికీ ఎంతో విలువుందని వెల్లడించారు. సంస్కృతం ద్వారా ప్రాచీన భారత శాస్త్రాలు అన్న అంశంపై జరిగిన సదస్సులో జవదేకర్ మాట్లాడారు. మన సంస్కృత భాష అలాగే మన ప్రాచీన శాస్త్ర విజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకుని జర్మనీలు, ఇతర దేశాలు సరికొత్త శాస్త్రీయ పరికరాలు ఉత్పత్తి చేస్తున్నప్పుడు, ఆ పని మనం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు.

భారతీయ ప్రాచీన శాస్త్ర విజ్ఞానం సంస్కృత భాష ద్వారానే శతాబ్దాలుగా విస్తరిస్తూ వచ్చిందని వెల్లడించారు. భాష ప్రాతిపదికగా ప్రాచీన శాస్త్ర విజ్ఞానం గురించి చర్చిండమన్నది అత్యంత ఆసక్తికర విషయమని అన్నారు. ఏ భాషైనా విజ్ఞానాన్ని విస్తరించేందిగా పెంపొందించేదిగానే ఉంటుందని వెల్లడించారు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనుకునే వ్యక్తులు అది ఎంత ప్రాచీనమైనదో ఆలోచించరని, దాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి ప్రయత్నిస్తారన్నారు.

ప్రాచీనమైన ప్రతిదీ బంగారం కాదని, అలాగే పాతదనాన్ని వృధాగా పరిగణించడానికి వీలులేదని తెలిపారు. అసలు శాస్త్ర విజ్ఞానం అంటే ఏమిటి అన్న స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్లగలిగినప్పుడే ఈ రంగంలో కొత్త పుంతలు తొక్క గలుగుతామని పేర్కొన్నారు. తను సంస్కృతంలో ప్రసంగించలేకపోయినా ప్రతిరోజూ ఉదయం సంస్కృత వార్తలను వింటానన్నారు. ఏ భాషకైనా మూలం సంస్కృతమేనని దాన్ని ఔపోసన పడితే ఇతర భాషలు సులభంగా వస్తాయన్నారు.

ఏడువేల ఏళ్ల కిందటే భారత్‌లో విమానాలు ఉన్నాయని పైలట్ శిక్షణ కేంద్రం మాజీ ప్రిన్సిపల్ కెప్టెన్ ఆనంద్ జె బోడాస్ పేర్కొన్నారు. ఆ విమానాల సాయంతో ఒక దేశం నుండి మరో దేశానికి, ఒక గ్రహం నుండి మరో గ్రానికి పయనించేవారన్నారు. వేదాల్లో ప్రాచీన వైమానిక పరిజ్ఋానంపై ఆయన సైన్స్ కాంగ్రెస్‌లో వివాదాస్పద ప్రసంగం చేశారు.

ఆనంద్ వైఖరిపై ఇటీవల కొన్ని విమర్శలు వచ్చాయి. నిదర్శనపూర్వమైన ఆధారాల ప్రాముఖ్యతను ఆయన విస్మరిస్తున్నారని పలువురు శాస్త్రవేత్తలు విమర్శించారు.

ఆయన తన తాజా ప్రసంగంలో.. ప్రాచీన భారత దేశంలో వైమానిక పరిజ్ఢానం ఉందనడానికి రుగ్వేదంలో ఆధారాలు ఉన్నాయని, ఖండాంతరాలకు, ఇతర గ్రహాలకు మనుషులను తీసుకు వెళ్లే విమానాలు ఏడు వేల ఏళ్ల కిందట ఉన్నాయని భరద్వాజ మహర్షి చెప్పారని, విమానయానంపై 97 పుస్తకాలను ఆయన ప్రస్తావించారని, అయితే తొలిసారిగా రైట్ సోదరులు 1904 గగన విహారం చేసినట్లు చరిత్రలో రాశారని వ్యాఖ్యానించారు.

విమాన సంహిత పుస్తకాన్ని భరద్వాజుడు రాశాడని చెప్పారు. విమానాన్ని తయారు చేయడానికి అవసమరైన మిశ్ర లోహాల గురించి ఆ మహర్షి వివరించారన్నారు. ప్రాంచీన భారత విమానాలు రెండువందల అడుగుల వరకూ పొడువును కలిగి ఉండేవన్నారు. వాటిలో 40 చిన్న ఇంజిన్లు ఉండేవన్నారు. అప్పట్లో రాడర్ వ్యవస్థను కూడా ఉపయోగించేవారని చెప్పారు. పైలట్ల ఆహారంపై భరద్వాజుడు పుస్తకం రాశాడన్నారు. నీటి అడుగున పెరిగిన మొక్కల సాయంతో పైల్టల్ దుస్తులను తయారు చేసేవారన్నారని చెప్పారు.

English summary
Ancient Indian scientists had mastered aviation to an extent that they had aeroplanes that could facilitate inter-planetary travel and the same has been mentioned in the Rigvedas, claimed Captain Anand Bodas, a retired principal of a pilot training facility, on the second day of the 102nd Indian Science Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X