• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాహుల్‌గాంధీ స్వలింగ సంపర్కుడే..? గాడ్సే-సావర్కర్ హోమో సెక్స్ కామెంట్లపై హిందూ మహాసభ

|
  Nathuram Godse And Veer Savarkar Controversy | గాడ్సే-సావర్కర్ హోమో సెక్స్ కామెంట్లపై హిందూ మహాసభ

  నాథురాం గాడ్సే-వినాయక్ దామోదర్ సావర్కర్ స్వలింగ సంపర్కులేనని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచురించిన బుక్‌లెట్ అగ్గిరాజేసింది. ఆ బుక్‌లెట్‌ను నిషేధించాలని సావర్కర్ మనమడు ఇప్పటికే డిమాండ్ చేశారు. తాజాగా హిందూ మహాసభ నేత కూడా ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ కూడా స్వలింగ సంపర్కుడేనని తాము విన్నామని మహాసభ నేతలు ఆరోపించారు.

  నాథురాం గాడ్సే-సావర్కార్‌ స్వలింగ సంపర్కులు, బ్రహ్మచర్యం కన్నా ముందు అదే పని..

  రాహుల్ గాంధీ..

  రాహుల్ గాంధీ..

  వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ మహాసభ ఆరోపణలను హిందూ మహాసభ అధ్యక్షులు స్వామి చక్రపాణి కొట్టిపారేశారు. తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదని సూచించారు. అంతేకాదు రాహుల్ గాంధీ కూడా స్వలింగ సంపర్కుడేనని తాము విన్నామని తెలిపారు. వీర్ సావర్కర్ పేరులోనే వీరత్వం ఉంది.. కానీ ధైర్యం ఎక్కడ అని బుక్‌లెట్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

  బీజేపీ, శివసేన కూడా

  బీజేపీ, శివసేన కూడా

  బీజేపీతోపాటు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం శివసేన కూడా ఖండించింది. సేవాదళ్ పుస్తకంలో సావర్కర్‌ను కించపరచడం సరికాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. వీర్ సావర్కర్ గొప్ప వ్యక్తి అని, కానీ కొందరు మాత్రం అతనిపై చెడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారిలో ఆలోచనలోనే చెడు ఉంది తప్పా... సావర్కర్‌లో కాదని హితవు పలికారు.

  ఇదీ విషయం

  ఇదీ విషయం

  హిందు మహాసభ సహా వ్యవస్థాపకులు వినాయక్ దామోదర్ సావర్కర్-నాథురాం గాడ్సే మధ్య ఆ బంధం ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుక్‌లెట్‌లో పేర్కొన్నది. భోపాల్‌లో అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ శిక్షణా శిబిరంలో గురువారం బుక్‌లెట్‌ను ఆవిష్కరించింది. సావర్కర్-గాడ్సే ఇద్దరు స్వలింగ సంపర్కులని పేర్కొని సంచలనం సృష్టించింది. నాథురాం గాడ్సే బ్రహ్మచర్యం పొందకముందు సావర్కార్‌తో సంపర్కం చేసుకునేవారనే ప్రస్తావించింది. ఇందులో ఆరెస్సెస్, వీర్ సావర్కర్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలను కూడా సంధించింది.

  ఇవీ ప్రశ్నలు

  ఇవీ ప్రశ్నలు

  హిందువులు మైనారిటీలు అయిన ముస్లింలపై లైంగికదాడి చేయడాన్ని సావర్కర్ ప్రోత్సహిస్తారా అని ప్రశ్న ఇచ్చి.. బుక్‌లెట్‌లో ఔను అని సమాధానం పెట్టింది. అంతేకాదు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే సావర్కర్ మసీదుపై రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నది. ఆరెస్సెస్ అనేది హిట్లర్ నాజీ నుంచి ముస్సొలినీ ఫాసిజం నుంచి ఆవిర్భవించిందని మండిపడింది. ఆరెస్సెస్ నేతల ఒంటెద్దు పోకడలతోనే కొత్త చట్టాలు తీసుకొస్తున్నారనే విధంగా విమర్శలు గుప్పించింది.

  రాహుల్ సవార్కర్

  రాహుల్ సవార్కర్

  గతనెలలో రాహుల్ గాంధీ కూడా వీర్ సావర్కర్ పేరును పలుకడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. భారతదేశం అత్యాచార దేశమని, మహిళలకు భద్రత లేదని జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. దీనిపై లోక్‌సభలో అధికార బీజేపీ సభ్యుల క్షమాపణకు డిమాండ్ చేశారు. తర్వాత జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను రాహుల్ గాంధీని అని.. రాహుల్ సావర్కర్ కాదని చెప్పడంతో దుమారం చెలరేగింది. దీనిని మిత్రపక్షం శివసేన తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఉంటే గురువారం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వీర్ సావర్కర్-గాడ్సే మధ్య ఆ బంధం ఉందని బుక్‌లెట్ ప్రచురించడంతో మళ్లీ వివాదం చెలరేగింది.

  English summary
  Veer Savarkar and Nathuram Godse had physical relations, now the Akhil Bhartiya Hindu Mahasabha has said there are similar claims about Rahul Gandhi too
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more