బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో భారీ వర్షాలు, రోడ్లు జలమయం, నాలుగు అడుగుల ఎత్తులో నీరు !

బెంగళూరులో ఆదివారం రాత్రి భారీ వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి వెళ్లడంతో ప్రజలు జాగారం చేశారు. ఎడతెరిపిలేకుండా గత మూడు రోజుల నుంచి రాత్రి పూట బెంగళూరు నగరంలో కుండపోత వర్షం కురుస్త

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో ఆదివారం రాత్రి భారీ వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి వెళ్లడంతో ప్రజలు జాగారం చేశారు. ఎడతెరిపిలేకుండా గత మూడు రోజుల నుంచి రాత్రి పూట బెంగళూరు నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది.

బెంగళూరు భారీ వర్షాలు గ్యాలరీ

బెంగళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సిల్క్ బోర్డు జంక్షలోని రోడ్లలో నాలుగు అడుగుల ఎత్తులో నీరు చేరుకోవడంతో వాహనచోదకులు, ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గూరగుంటపాళ్య, కురబరహళ్ళి, బనశంకరి, కంగేరి, జయనగర, జేపీ నగర, టిన్ ఫ్యాక్టరీ, కేఆర్ పురం, హెబ్బాళ, యలహంక తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Heavy rain in Bengaluru on sunday night

పలు ప్రాంతాల్లో వర్షం నీరు డ్రైనేజ్ ల నుంచి రోడ్ల మీదకు రావడంతో నిర్లక్షంగా వ్యవహరిస్తున్న బీబీఎంపీ అధికారుల మీద ప్రజలు మండిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో డ్రైనేజ్ లు పూర్తిగా మూసివేయడంతో వర్షం నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పలు వార్డుల్లో వర్షం నీరు రోడ్ల మీద నిలిచిపోయి ఇళ్లలోకి వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా సోమవారం మద్యహ్నం వరకు నిలిచిపోయింది. నగరాభివృద్ది శాఖ మంత్రి కేజే. జార్జ్, బెంగళూరు మేయర్ పధ్మావతి నిర్లక్షం చేస్తున్నారని ఆరోపిస్తు వారి దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Heavy rain in Bengaluru on Sunday night. Water in to the houses in many areas. BBMP become helpless.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X