బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరుకు వానల దెబ్బ, ఉత్తర కర్ణాటకకు పర్యాటకులు రావద్దు, వరమహాలక్ష్మి వ్రతం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో మరో రెండు రోజులు వానలు కురుస్తాయని గురువారం వాతావరణ శాఖ తెలిపింది. గత మూడు రోజుల నుంచి బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. వానల దెబ్బ వరమహాలక్ష్మి వ్రతం పండగ మీద పడింది. వానలకు పండ్లు, పూల ధరలు ఆకాశాన్ని అంటాయి. మరో రెండు రోజులు బెంగళూరులో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

బెంగళూరు కేంద్ర విభాగంలో గరిష్టంగా 25, 2 డిగ్రిల సెల్సియస్, కనిష్టంగా 20. 8 డిగ్రిల సెల్సియస్, కేఐఏఎల్ (బెంగళూరు ఎయిర్ పోర్టు)లో గరిష్టంగా 25. 4 డిగ్రిల సెల్సియస్, కనిష్టంగా 20. 5 డిగ్రిల సెల్సియస్, హెచ్ఏఎల్ లో గరిష్టంగా 26 డిగ్రిల సెల్సియస్, కనిష్టంగా 20. 4 డిగ్రిల సెల్సియస్ నమోదైయ్యింది.

Heavy rain havoc will occur next 72 hours in Bengaluru in Karnataka

గత మూడు రోజుల నుంచి బెంగళూరులో వానలు కురుస్తున్నాయి. బెంగళూరు నగర శివారల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్ణాటకలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కర్ణాటకలో నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని, ముందు జాగ్రతగా పర్యాటకులు జిల్లాకు రాకూడదని జిల్లా అధికారులు మనవి చేశారు.

భాగమండల, కోట్టిగెహర, హోసనగర, కోల్లూరు, శివమొగ్గ, యల్లాపుర, పంచెదకెట్టి, పోన్నంపేట, కమ్మరడిలో భారీ వర్షాలు పడుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలు కుక్కే సుబ్రమణ్య, శృంగేరితో పాటు కోప్ప, ఖానాపుర, బెళగావి. హళియూరు, వీరాజ్ పేట, జయపుర, కిత్తూరు, విజయపురలో భారీ వర్షాలు పడుతున్నాయి.

English summary
Heavy rain havoc will occur next 72 hours in Bengaluru in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X