హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వడోదరలో వర్ష బీభత్సం, గురువారం పాఠశాలకు సెలవు.. తడిసి ముద్దయిన హైదరాబాద్

|
Google Oneindia TeluguNews

వడోదర/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పలుప్రాంతాలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్, ఇతర ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. వర్ష బీభత్సం ధాటికి వడోదరలో గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరో హైదరాబాద్ నగరం వర్షంతో తడిసిముద్దయ్యింది.

వడోదరలో భారీ వర్షం కురిసింది. దీంతో వీధుల్లో నీరు నిలిచిపోయింది. దీంతో కాలనీలు జలమయంగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. వర్ష బీభత్సానికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. వడోదరలో వర్ష బీభత్సంతో ప్రభుత్వం గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. దీంతో సౌరాష్ట్రలో మంగళవారం భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. దీంతోపాటు వల్సాద్, భారుచ్, నవసరీ, టపీ, బానస్కంత, పాటన్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది.

Heavy rain lashes Gujarat city, holiday in schools tomorrow

మరోవైపు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపు వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, వారసిగూడ, బౌద్దనగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, సురారం, చింతల్, సుచిత్ర, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శ్రీనగర్ కాలనీలో వర్షం కురసింది. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. ఆగస్ట్ 3 నుంచి 6 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కుస్తాయని పేర్కొన్నారు.

English summary
Heavy rains have been experienced across many parts of the country. Rainfall in Gujarat and other parts of the country along with Telugu states. Vadodara on Thursday announced a holiday for schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X