వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు (వీడియో)

|
Google Oneindia TeluguNews

ముంబై: వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అయ్యింది. గురువారం రాత్రి కుండపోత వర్షం కురవడంతో ముంబై నగరం జలమయం అయ్యింది. రవాణా వ్యవస్థ దాదాపు పూర్తిగా స్థంబించింది. కార్పొరేషన్ అధికారులు ఏ ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలో తెలియక నానా తంటాలు పడ్డారు.

గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు ముంబై నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. ముంబై నగరంలో రికార్డు స్థాయిలో 188 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ముంబై నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బృహాన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

 Heavy rain in Mumbai, Schools closed, trains services suspended

పలు ప్రాంతాలలోని మురికివాడలు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు రాత్రి నానా అవస్థలు పడ్డారు. కాలువలు, రోడ్ల మీద నీరు ఇండ్లలోకి చేరింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విద్యుత్ స్థంభాలు నేలమట్టం కావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

చత్రపతి శివాజీ టెర్మినల్, కుర్ణా సుబర్బ్ లోని మద్య రైల్వే సేవలు నిలిచిపోయాయి. పలు చోట్ల రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని రైళ్లు నిలిచిపోయాయి. శుక్రవారం అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. పిల్లలను స్కూల్ లకు పంపించరాదని అధికారులు సూచించారు. శుక్రవారం ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతాయని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

English summary
Brihanmumbai Municipal Corporation (BMC) has advised people to stay indoors and travel only in case of an emergency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X