వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో వర్ష బీభత్సం: 107 కిలోమీటర్ల వేగంతో గాలులు, సిటీ జలమయం, అలర్ట్

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బుధవారం కురిసిన వర్షాలతో నగరమంతా జలమయమైంది. వర్షానికి తోడు గంటకు 107 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు బీభత్సం సృష్టించాయి.

భారీ వర్షాల కారణంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో ముంబై ప్రజలు బయటికి రావొద్దంటూ మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే, పోలీసు అధికారులు సూచించారు. వేగంగా వీచిన గాలులతో అనేక చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలు చెట్లు ఇళ్లు, వాహనాలపై కూలాయి.

Heavy Rain: Mumbai Whipped By Winds At Cyclone Speed Of 107 Kmph

బుధవారం సాయంత్రం కోలాబాలో 22.9 సెంటిమీటర్లు, శాంతక్రూజ్ ప్రాంతంలో 8.8 సెంటిమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాత్రి, గురువారం కూడా ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక గాలులు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.

భారీ వర్షాల కారణంగా ముంబై, థానే ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ముంబైలో పరిస్థితిని సీఎం ఉద్ధవ్ థాక్రే అధికారులు, ఇతర మంత్రులతో సమీక్షించారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, బయటికి రావొద్దని పోలీసులు సూచించారు.

ఏదైనా ప్రమాదంలో ఉంటే వెంటనే 100కు డయల్ చేయాలని కోరారు. కాగా, భారీ వర్షాలు, వరదల కారణంగా 2005 నాటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. కాగా, ముంబైలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు.

English summary
The weather in Mumbai – which is being pounded by heavy rains for more than two days -- slid a few more notches this afternoon as the winds picked up, reaching upto 107 km per hour by evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X